Site icon NTV Telugu

T20 World Cup: టీమిండియా ఓపెనర్‌గా రాహుల్ గాంధీ.. షాక్ అవుతున్న అభిమానులు

Rahul Gandhi Team India

Rahul Gandhi Team India

T20 World Cup: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో బ్యాట్ పట్టబోతున్నాడు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓపెనర్ అవతారం ఎత్తనున్నాడు. రోహిత్ శర్మతో పాటు రాహుల్ గాంధీ ఓపెనర్‌గా రాబోతున్నాడు. ఇదంతా నిజమా అని మీరు అనుకోకండి. రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో ఇండియన్ టీమ్‌లోని బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఓ టీవీ యాంకర్ న్యూస్ చదువుతూ తడబడ్డాడు. ఇండియన్ టీమ్‌లో ఓపెనర్లుగా రోహిత్ శర్మతో పాటు రాహుల్ గాంధీ బరిలోకి దిగనున్నట్లు చెప్పాడు. కేఎల్ రాహుల్‌కు బదులుగా రాహుల్ గాంధీ అనడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్‌లు షాక్ అవుతున్నారు. రాహుల్ గాంధీకి, కేఎల్ రాహుల్‌కు కూడా తేడా తెలియదా అంటూ యాంకర్‌ను ఆడేసుకుంటున్నారు.

https://twitter.com/OFCCricket/status/1571708677425598465

అటు టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ తమకు మూడో ఓపెనర్ అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. అతడు ఓపెనింగ్‌కు దిగితే నష్టమేంటని మీడియా సమావేశంలో ప్రశ్నించాడు. ప్రపంచకప్‌లో తనతో పాటు కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడని.. కానీ కేఎల్ రాహుల్ ప్రదర్శనపై ఇంకా తాము ఒక అంచనాకు రాలేదన్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్‌లలో రాహుల్ రాణించాల్సి ఉంటుందని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. మరోవైపు టీ20 ప్రపంచకప్‌ ముందు టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఈ మేరకు ఆదివారం నాడు బీసీసీఐ ఎంపీఎల్ స్పాన్సర్డ్ జెర్సీని విడుదల చేసింది. ఆస్ట్రేలియాతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న మూడు టీ20ల సిరీస్‌లో భారత జట్టు కొత్త జెర్సీని ధరించనుంది.

Exit mobile version