Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
- మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్
- టీమిండియాకు కాదు.. ఇంగ్లండ్ జట్టుకు కోచ్‌గా ద్రవిడ్
- ద్రవిడ్ ఆసక్తి చూపడం లేదని సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Dravid A Candidate For England Test Coach: భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ మరోసారి హెడ్ కోచ్‌గా రానున్నాడా? అంటే… అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే ‘ది వాల్’ కోచ్‌గా వచ్చేది టీమిండియాకు కాదు.. ఇంగ్లండ్ జట్టుకు. ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్ కోచ్ పదవికి ద్రవిడ్ పేరు బలంగా వినిపిస్తోంది. టెస్టు ఫార్మాట్లో వరుస నిరాశాజనక ఫలితాల నేపథ్యంలో బ్రెండన్ మెకల్లమ్‌ను టెస్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పించిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ).. కొత్త కోచ్ కోసం అన్వేషణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ది వాల్ పేరు పరిశీలనలో ఉన్నట్లు డైలీ టెలిగ్రాఫ్ పేర్కొంది.
మార్పులు అవసరమని భావించిన ఈసీబీ:
రాహుల్ ద్రవిడ్‌తో పాటు మాజీ ఇంగ్లండ్ కోచ్ ఆండీ ఫ్లవర్, మాజీ స్పిన్నర్ రిచర్డ్ డాసన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లుతెలుస్తోంది. అయితే బ్రెండన్ మెకల్లమ్ మాత్రం వన్డే, టీ20 జట్లకు హెడ్ కోచ్‌గా కొనసాగనున్నాడు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ 1-2తో కోల్పోవడంతో ఈసీబీ టెస్టు జట్టులో మార్పులు అవసరమని భావించింది. వచ్చే ఏడాది జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని టెస్టు జట్టుకు కొత్త దిశ అవసరమని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో నాలుగేళ్లుగా టెస్టు జట్టుకు కోచ్‌గా కొనసాగిన మెకల్లమ్ పదవికి ముగింపు పలికింది.
Also Read
- TG20 తొలి ఛాంపియన్‌గా 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'.. ఖమ్మం ఏసెస్‌పై 6 వికెట్లతో ఘన విజయం.!
- Virat Kohli: ఇంగ్లాండ్‌కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే 'కోచ్'గా మారిన కోహ్లీ!
- Shreyas Iyer Record: వరుస ఓటములు ఎదురైనా.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అరుదైన ఘనత!
- Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్‌కూ స్వేచ్ఛ ఇవ్వాలి
ఆసక్తి చూపడం లేదని సమాచారం:
రాహుల్ ద్రవిడ్ కోచింగ్ నైపుణ్యం, ఆటపై అతడికి ఉన్న పూర్తి అవగాహన ఈసీబీని ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. భారత జట్టుకు కోచ్‌గా పనిచేసిన ద్రవిడ్.. 2024 టీ20 ప్రపంచకప్‌ను అందించడంతో పాటు 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు భారత్‌ను చేర్చాడు. ఆటగాళ్ల అభివృద్ధి, వ్యూహాత్మక ఆలోచన, క్రమశిక్షణతో కూడిన కోచింగ్ శైలి కారణంగా అతడిని అత్యుత్తమ కోచ్‌లలో ఒకరిగా భావిస్తున్నారు. అయితే ద్రవిడ్ పూర్తికాలం కోచ్‌గా పని చేయాలనే ఆసక్తి చూపడం లేదని ఓ నివేదిక పేర్కొంది. ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్ బాధ్యతలు చేపడితే ఏడాది పొడవునా ప్రయాణాలు చేయాల్సిన అవసరం తక్కువగా ఉండటం, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉండటం అతడికి అనుకూలం అనే చెప్పొచ్చు. టెస్టు క్రికెట్‌పై ద్రవిడ్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉన్న విషయం తెలిసిందే.
ఆండీ ఫ్లవర్ కూడా బలమైన అభ్యర్థి:
రేసులో జింబాబ్వే దిగ్గజం ఆండీ ఫ్లవర్ కూడా బలమైన అభ్యర్థిగా ఉన్నాడు. ఇంగ్లండ్‌కు ఆధునిక యుగంలో అత్యంత విజయవంతమైన కోచ్‌గా గుర్తింపు పొందిన ఫ్లవర్.. మూడు యాషెస్ సిరీస్ విజయాలు అందించాడు. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు అందించిన అనుభవం కూడా అతడికి ఉంది. ప్రస్తుతం గ్లామోర్గన్ హెడ్ కోచ్‌గా ఉన్న రిచర్డ్ డాసన్ కూడా వ్యూహాత్మక నైపుణ్యంతో ఆకట్టుకోవడంతో ఈసీబీ పరిశీలనలో ఉన్నాడు. శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర, ఇంగ్లండ్ లయన్స్ కోచ్ ఆండ్రూ ఫ్లింటాఫ్, పాకిస్థాన్ హెడ్ కోచ్ మైక్ హెసన్, మాజీ ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ పేర్లు కూడా ఇంగ్లండ్ టెస్టు కోచ్ రేసులో వినిపిస్తున్నాయి. అయితే చివరికి ఈసీబీ ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ద్రవిడ్ ఈ బాధ్యతలపై ఆసక్తి చూపుతాడా? లేదా? అన్నది ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Slum Dog Release : పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ సినిమా థియేట్రికల్ రైట్స్ కొనేదెవరు?
-
TG20 తొలి ఛాంపియన్‌గా ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’.. ఖమ్మం ఏసెస్‌పై 6 వికెట్లతో ఘన విజయం.!
-
Israel General Election 2026: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలకు తేదీ ఖరారు.. గాజా యుద్ధం నేపథ్యంలో నెతన్యాహుకు కీలక పరీక్ష
-
Maa Inti Bangaram OTT: 100 కోట్ల క్లబ్లో ‘మా ఇంటి బంగారం’.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!