Team India Captain: భారత క్రికెట్ జట్టుకి రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్నప్పటికీ.. ప్రత్యామ్నాయం కోసం యాజమాన్యం కొందరిని పరీక్షిస్తోంది. రోహిత్ గైర్హాజరుతో పాటు భవిష్యత్తులో జట్టుని ముందుండి నడిపించే నాయకుడి హోదాకు ఎవరు సరిపోతారో చూసేందుకు.. ఇప్పటి నుంచే టెస్టులు నిర్వహిస్తోంది. ఆయా ఫార్మాట్లకు అనుగుణంగా కెప్టెన్లను ఎంపిక చేస్తూ.. సారథిగా బాధ్యతలు నిర్వర్తించే సత్తా ఎవరికి ఉందని బీసీసీఐ పరిశీలిస్తోంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యా, బుమ్రా వంటి వాళ్లని కెప్టెన్లుగా నియమించింది. వీరితో పాటు మరికొందరిని సైతం పరిశీలించే పనిలో ఉంది.
Viral Video: వీళ్లు నిజంగా సూపర్బ్ పోలీసులే.. స్కూటీపై వెంబడించి దొంగలను పట్టుకున్నారు
ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో టీమిండియాని నడిపించే సత్తా శ్రేయస్ అయ్యర్‌కి ఉందని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో భాగంగా కేకేఆర్ జట్టులో శ్రేయస్‌తో కలిసి ఆడిన అతను, ఆ అనుభవంతోనే శ్రేయస్‌కి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని కొనియాడాడు. శ్రేయస్ ప్రస్తుతం కేకేఆర్‌కి సారథ్యం వహిస్తున్నాడని, అంతకుముందు ఢిల్లీ ఫ్రాంచైజీకి కూడా కెప్టెన్‌గా పని చేశాడని గుర్తు చేశాడు. ఐపీఎల్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రాంచైజీ లీగ్ అని.. ఈ లీగ్‌లో ఒక జట్టుకి నాయకత్వం వహించగలిగితే, ప్రపంచంలోనే ఏ జట్టునైనా ముందుకు నడిపించగలడని చెప్పుకొచ్చాడు.
Extramarital Affair: ‘అక్క’తోనే ఎఫైర్.. విషయం తెలిసి భర్త ఏం చేశాడంటే?
టీమిండియాకు శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా నాయకత్వం వహిస్తాడని గుర్బాజ్ ధీమా వ్యక్తం చేశాడు. టైమ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్బాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కేవలం నాయకత్వ లక్షణాలే కాదు, శ్రేయస్ ఒక మంచి ఆటగాడు అని.. పరిస్థితులకు అనుగుణంగా అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడని ప్రశంసించాడు. ఇదిలావుండగా.. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన శ్రేయస్, దాదాపు 8 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఆసియాకప్-2023తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.