Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత చెస్ సంచలనం, గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం (జూన్ 5, 2026) జరిగిన నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. టోర్నమెంట్ చివరి రౌండ్లో జర్మనీకి చెందిన గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్‌పై అద్భుత విజయం సాధించిన ప్రజ్ఞానంద మొత్తం 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో నార్వే చెస్ టోర్నమెంట్‌ను గెలిచిన తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
20 ఏళ్ల ప్రజ్ఞానంద టోర్నమెంట్ చివరి దశలో అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. వరుసగా నాలుగు క్లాసికల్ గేమ్‌ల్లో విజయం సాధించి తన సత్తా చాటాడు. టోర్నమెంట్ మధ్యలో కొన్ని పరాజయాలతో పాయింట్ల పట్టికలో వెనుకబడినప్పటికీ, చివరి రౌండ్లలో అద్భుత పునరాగమనం చేసి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ఫైనల్ రౌండ్‌కు ముందు అమెరికాకు చెందిన వెస్లీ సో ఆధిక్యంలో ఉన్నాడు. అయితే ప్రజ్ఞానంద విజయం సాధించగా, వెస్లీ సో తన క్లాసికల్ మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. దీంతో ప్రజ్ఞానంద ఒక పాయింట్ ఆధిక్యంతో ఛాంపియన్‌గా నిలిచాడు. అనంతరం జరిగిన ఆర్మాగెడాన్ గేమ్‌లో వెస్లీ సో, అలీరెజా ఫిరౌజ్జాను ఓడించి 17 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
ప్రజ్ఞానంద స్పందన
టైటిల్ విజయం అనంతరం ప్రజ్ఞానంద మాట్లాడుతూ, “టోర్నమెంట్లో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయినా వాటి గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ప్రతి గేమ్‌ను కొత్తగా తీసుకుని కేవలం నా ఆటపై మాత్రమే దృష్టి పెట్టాను. చివరికి ఆ కృషికి ఫలితం దక్కడం ఆనందంగా ఉంది” అని తెలిపాడు. ఈ విజయంతో ప్రపంచ చెస్ వేదికపై భారత యువ గ్రాండ్‌మాస్టర్ మరోసారి తన ప్రతిభను చాటుతూ భారత చెస్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!