NTV Telugu Site icon

Andhra Pradesh: సంక్రాంతి లక్కీడ్రా వ్యవహారం.. మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

Ambati Rambabu

Ambati Rambabu

Andhra Pradesh: సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంలో మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రైజ్‌ చిట్స్‌ అండ్‌ మనీ సర్కులేషన్‌ స్కీమ్స్‌ నిషేధ చట్టం కింద మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సంక్రాంతి లక్కీ డ్రా టిక్కెట్లను ఒక్కొక్కటి రూ.100 చొప్పున మంత్రి అంబటి రాంబాబు సహా వైసీపీ నేతలు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3 లక్షలకు పైగా టిక్కెట్లను ముద్రించి పార్టీ కార్యకర్తలు, వార్డు సచివాలయ వాలంటీర్ల ద్వారా విక్రయిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read Also: Microsoft Layoffs: 10,000 మంది ఉద్యోగాలు ఊస్ట్.. ప్రకటించిన మైక్రోసాఫ్ట్

అయితే పోలీసులు మంత్రి అంబటి రాంబాబుపై ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంతో జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు గుంటూరు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై విచారణ జరిపిన కోర్టు.. మంత్రి అంబటి రాంబాబుపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు.