IND vs AUS: ఆస్ట్రేలియా టూర్ ను భారత జట్టు పేలవంగా ఆరంభించింది. పెర్త్‌లో జరిగిన మొదటి వన్డేలో టీమిండియాపై ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌కు పలుమార్లు వరుణుడు ఆటంకం కలిగించడంతో ఆటను 26 ఓవర్లకు అంపైర్లు కుదించారు. ఇక, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గిల్ సేన.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 రన్స్ చేసింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం కంగారు జట్టుకు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 21.1 ఓవర్లలోనే 3 వికెట్లు నష్టపోయి ఛేదించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (46 నాటౌట్), జోష్ ఫిలిప్ (37) రాణించారు. రెన్ షా (21 నాటౌట్) రన్స్ చేశాడు. ట్రావిస్ హెడ్ (8)ని అర్ష్‌దీప్, మాథ్యూ షార్ట్ (8)ని అక్షర్ పటేల్ అవుట్ చేశారు. అలాగే, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఫిలిప్ డగౌట్ కు చేరాడు. ఇక, రెండో వన్డే గురువారం నాడు జరగనుంది.
Read Also: Eluru : ఏలూరులో దీపావళి టపాసుల అమ్మకాలపై వర్షం ఎఫెక్ట్..!
అయితే, మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. విరాట్ కోహ్లీ డకౌట్ కాగా.. రోహిత్ శర్మ (8), శుభ్‌మన్ గిల్ (10), శ్రేయస్ అయ్యర్ (11), వాషింగ్టన్ సుందర్ (10) తీవ్రంగా నిరాశపరిచారు, ఇక, చివర్లో నితీశ్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సులు కొట్టడంతో గౌరవప్రదమైన స్కోర్ కు టీమిండియా చేరుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కునెమన్ రెండేసి వికెట్లు తీసుకొగా, మిచెల్ స్టార్క్, నాథన్ ఎలిస్‌కు తలో వికెట్ దక్కింది.
