Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Paul Stirling Breaks Rohit Sharmas Record Most T20i Matches In History

Paul Stirling History: రోహిత్ శర్మ రికార్డు బద్దలు.. టీ20 చరిత్రలో పాల్ స్టిర్లింగ్ సరికొత్త చరిత్ర!

Published Date :January 30, 2026 , 1:41 pm
By Sampath Kumar
  • టీ20 చరిత్రలో పాల్ స్టిర్లింగ్ సరికొత్త చరిత్ర
  • మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు బద్దలు
  • మరో అరుదైన ఘనతకు చేరువగా స్టిర్లింగ్
Paul Stirling History: రోహిత్ శర్మ రికార్డు బద్దలు.. టీ20 చరిత్రలో పాల్ స్టిర్లింగ్ సరికొత్త చరిత్ర!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా స్టిర్లింగ్ రికార్డుల్లో నిలిచాడు. గురువారం దుబాయ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో అతడి ఖాతాలో ఈ రేర్ రికార్డు చేరింది. స్టిర్లింగ్ ఇప్పటివరకు 160 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇదివరకు ఈ రికార్డు భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. రోహిత్ టీ20 క్రికెట్‌లో 159 మ్యాచ్‌లు ఆడాడు. రోహిత్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో మరో ఐర్లాండ్ ప్లేయర్ జార్జ్ డాక్రెల్ ఉన్నాడు. డాక్రెల్ ఇప్పటివరకు 153 మ్యాచ్‌లు ఆడాడు. అఫ్గాన్ ప్లేటెర్ మహమ్మద్ నబీ 148 మ్యాచ్‌లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ మాజీ కీపర్ జోస్ బట్లర్ (144) టాప్-5లో ఉన్నాడు. డాక్రెల్, నబీ ఇంకా ఆడుతున్నారు కాబట్టి రోహిత్ శర్మను దాటే అవకాశాలు ఉన్నాయి. ఇక టీ20 ఫార్మాట్‌లో స్థిరత్వం, అనుభవానికి ప్రతీకగా నిలిచిన పాల్ స్టిర్లింగ్.. ఐర్లాండ్ జట్టు విజయాల్లో ఎన్నో ఏళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ఫిట్‌నెస్, ఫామ్‌ను నిలబెట్టుకుంటూ.. అంతర్జాతీయ స్థాయిలో నిరంతరం ఆడుతూ ఈ ఘనత సాధించాడు.

Also Read: Moto Signature Flipkart: మోటో సిగ్నేచర్ సేల్స్ ప్రారంభం.. 50+50+50MP కెమెరాలు, 5200mah కార్బన్‌ బ్యాటరీ!

పాల్ స్టిర్లింగ్ మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో 2007 నుంచి 2024 వరకు జరిగిన అన్ని ఎడిషన్లలో రోహిత్ శర్మ ఆడాడు. బంగ్లాదేశ్ స్టార్ షకీబ్ అల్ హసన్ కూడా ఈ అరుదైన ఘనతను సాధించాడు. వీరిద్దరూ ఇప్పటివరకు 9 టీ20 వరల్డ్‌కప్‌ల్లో పాల్గొన్నారు. 2026లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో పాల్ స్టిర్లింగ్ ఆడితే.. అతడూ 9 టీ20 వరల్డ్‌కప్‌ల్లో పాల్గొన్న ఆటగాడిగా రోహిత్, షకీబ్ సరసన నిలవనున్నాడు. ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలోనే కాకుండా ప్రపంచ టీ20 క్రికెట్‌లో కూడా స్టిర్లింగ్ పేరు శాశ్వతంగా నిలిచేలా ఈ రికార్డులు మారనున్నాయి. స్టిర్లింగ్ కెరీర్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ireland Cricket
  • Most T20I Matches
  • Paul Stirling
  • Paul Stirling History
  • Paul Stirling Record

తాజావార్తలు

  • Mercedes-Benz V-Class: గర్ల్ ఫ్రెండ్ కు రూ. 1.7 కోట్ల విలువైన కారును బహుమతిగా ఇచ్చిన హార్దిక్ పాండ్యా..!

  • CAG report Telangana: ప్రభుత్వ సంస్థల పరిస్థితి అగమ్యగోచరం.. కాగ్ రిపోర్టులో సంచలన నిజాలు..

  • BRS MLCs Suspended: శాసన మండలి హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మూకుమ్మడి సస్పెన్షన్!

  • Ajinkya Rahane: 25 కోట్లు పెట్టి కొన్న గ్రీన్‌తో ఎందుకు బౌలింగ్ చేయించలేదు.. ఆసక్తిర సమాధానం చెప్పిన కేకేఆర్ కెప్టెన్!

  • Bihar: ఎమ్మెల్సీకి నితీష్ కుమార్, ఎమ్మెల్యే పదవికి నితిన్ నవీన్ రాజీనామా

ట్రెండింగ్‌

  • Migraine in Women: మహిళల్లో అమాంతంగా పెరుగుతున్న ‘మైగ్రేన్’ సమస్య.. కారణాలు ఇవే.. జాగ్రత్త సుమీ.!

  • Instagram Offline Reels: రీల్స్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటర్నెట్ లేకపోయినా ‘రీల్స్’ చూసేయొచ్చు .. ఎలాగంటే.!

  • Remedies for Cracked Heels : మీ పాదాల పగుళ్లకు ఇక చెక్.. ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు.!

  • Lemon Pickle : వేసవి స్పెషల్.. నిమ్మకాయ పచ్చడి ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.!

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions