SRH Captain: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్.. ఫిట్‌నెస్ టెస్ట్ పాసయిన కమిన్స్.. రేపే జట్టులోకి ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు అదిరే శుభవార్త వచ్చింది. వెన్నునొప్పి కారణంగా గత నెల రోజులుగా క్రికెట్‌కు దూరమైన కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించి మైదానంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యాడు. ఐపీఎల్ కీలక దశకు చేరుకున్న తరుణంలో కమిన్స్ రాక జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సీజన్‌లో కమిన్స్ లేని లోటును భర్తీ చేస్తూ ఇషాన్ కిషన్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. కిషన్ నాయకత్వంలో ఆడిన 7 మ్యాచ్‌ల్లో SRH 4 విజయాలను సాధించి ప్లే-ఆఫ్స్ రేసులో బలంగా నిలిచింది. వన్ డౌన్ లో వస్తున్న కిషన్ రాణిస్తున్నప్పటికీ, జట్టు డెత్ ఓవర్ల బౌలింగ్‌లో, ఫీల్డ్ సెట్టింగ్‌లో కమిన్స్ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడి అవసరం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం జట్టు పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉన్నందున, మిగిలిన మ్యాచ్‌లు చాలా కీలకం కానున్నాయి.
ప్యాట్ కమిన్స్ కేవలం ఒక బౌలర్ మాత్రమే కాదు, ప్రపంచకప్ గెలిచిన అద్భుతమైన వ్యూహకర్త. క్లిష్ట సమయాల్లో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడంలో కమిన్స్ దిట్ట. ఇది యువ బౌలర్లకు కొండంత అండగా ఉంటుంది. దిల్షాన్ మధుశంక స్థానంలో కమిన్స్ నేరుగా తుది జట్టులోకి రానున్నాడు. దీనివల్ల పవర్ ప్లే , డెత్ ఓవర్లలో జట్టు బౌలింగ్ విభాగం మరింత పటిష్టమవుతుంది.
Also Read
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
- Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
- WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
- IND Vs WI 4th T20: ఉప్పల్‌లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
ఐపీఎల్‌తో పాటు రాబోయే టీ20 వరల్డ్ కప్‌కు కూడా దూరమవుతాడన్న వార్తలకు స్వస్తి పలుకుతూ, కమిన్స్ ఫిట్‌నెస్ సాధించడం ఆస్ట్రేలియాకు కూడా పెద్ద ఊరట. రానున్న శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌లో కమిన్స్ మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. తాను జట్టులోకి వస్తున్నట్లు ఆయనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ధృవీకరించడంతో ఆరెంజ్ ఆర్మీ ఫుల్ ఖుషీగా ఉంది.
తాజావార్తలు
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
-
TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
-
Tollywood: దసరా వార్‌లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..