Parthiv Patel-BCCI: ఏడాదికి రూ.3 కోట్లు.. అయినా చీఫ్ సెలెక్టర్ పదవికి నో చెప్పిన పార్థివ్ పటేల్.. అసలు కారణం ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Why Parthiv Patel Rejects BCCI Chief Selector Role: టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేయకపోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ బాధ్యతల నుంచి తప్పుకోగా.. ఆయన స్థానంలో పార్థివ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ పదవిపై పార్థివ్ కూడా ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చాయి. అయితే వెస్ట్ జోన్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసినా ఆయన అప్లికేషన్ సమర్పించలేదు. దీంతో ఈ కీలక బాధ్యతలను పార్థివ్ ఎందుకు వదులుకున్నారనే ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి.
రూ.3 కోట్ల ఆఫర్.. అయినా ఎందుకు వెనక్కి తగ్గారు?:
ది టెలిగ్రాఫ్ ఇండియా కథనం ప్రకారం.. పార్థివ్ పటేల్ ఈ పదవికి దరఖాస్తు చేయకపోవడానికి కొన్ని ఆర్థికపరమైన అంశాలు కారణం అని తెలుస్తోంది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికైతే ఏడాదికి సుమారు రూ.3 కోట్ల పారితోషికం దక్కనుంది. అయితే ఈ పదవిని చేపడితే ప్రస్తుతం చేతిలో ఉన్న ఇతర పనులను వదులుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్థివ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా, బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. దీనితో పాటు క్రికెట్ కామెంటరీ కూడా చేస్తున్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపడితే కోచింగ్, కామెంటరీ వంటి ఇతర పనులను కొనసాగించకూడదు.
Also Read
- Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
- Chris Gayle Catch: 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. గాల్లోకి ఎగిరి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే!
- Surya Kumar Yadav: టీమిండియా నుంచి డ్రాప్.. ఆ టోర్నీలో సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్..
- WCL 2026 Winner: రెచ్చిపోయిన బ్రావో, వాల్టన్, సిమ్మన్స్.. డబ్ల్యూసీఎల్ టైటిల్ విజేతగా వెస్టిండీస్!
రూ.7-9 కోట్ల వరకు ఆదాయం?:
గుజరాత్ టైటాన్స్ కోచింగ్ బాధ్యతలు, కామెంటరీ ద్వారా పార్థివ్ పటేల్ ఏడాదికి సుమారు రూ.7 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు సదరు నివేదిక పేర్కొంది. చీఫ్ సెలెక్టర్ పదవిని స్వీకరించడం వల్ల ఆయన ప్రస్తుత ఆదాయం భారీగా తగ్గనుంది. అందుకే రూ.3 కోట్ల పారితోషికం ఉన్నప్పటికీ.. ఆ పదవికి దరఖాస్తు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దక్షిణ మండలం నుంచి ఎంపికైన ప్రజ్ఞాన్ ఓజా సెలెక్షన్ కమిటీలో ఉన్నారు. వెస్ట్ జోన్ నుంచి కొత్త సెలెక్టర్‌ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, రమేశ్ పవార్ పేర్లు ఈ పదవికి ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
సెలెక్టర్ల జీతంపై అశ్విన్ ప్రశ్నలు:
పార్థివ్ పటేల్ చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేయలేదన్న వార్తల నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. బీసీసీఐ సెలెక్టర్లకు అందించే పారితోషికంపై ప్రశ్నలు లేవనెత్తాడు. భారత జట్టు ఎంపిక అనేది అత్యంత కీలకమైన బాధ్యత అని, ఈ పదవికి అనుభవం, ప్రతిభ ఉన్న మాజీ క్రికెటర్లను ఆకర్షించాలంటే మరింత మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని అభిప్రాయపడ్డాడు. సెలెక్టర్లకు కొన్ని పరిమితులు ఉంటాయని గుర్తుచేశాడు. వారు కోచింగ్ బాధ్యతలు చేపట్టడం లేదా మీడియా రంగంలో కొనసాగడం సాధ్యం కాదు. అదే సమయంలో దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ మ్యాచ్‌లను పరిశీలిస్తూ ఏడాది పొడవునా ఆటకు సంబంధించిన వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనాల్సి ఉంటుంది. ఇన్ని బాధ్యతలు, పరిమితులు ఉన్నప్పుడు తగిన పారితోషికం అందించడం అవసరమని అశ్విన్ పేర్కొన్నాడు. మాజీ భారత కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే వంటి అనుభవజ్ఞులు సెలెక్షన్ కమిటీలోకి రావాలంటే ఆకర్షణీయమైన పారితోషికం అవసరమని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: రోడ్డు ధ్వంసం చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు.. పవన్ కల్యాణ్ ఆదేశాలు
-
Parthiv Patel-BCCI: ఏడాదికి రూ.3 కోట్లు.. అయినా చీఫ్ సెలెక్టర్ పదవికి నో చెప్పిన పార్థివ్ పటేల్.. అసలు కారణం ఇదేనా?
-
Modi-Netanyahu: భారత్‌తో సంబంధాలపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
-
Hyundai Neira MPV: ఎర్టిగాకు పోటీగా హ్యుందాయ్ కొత్త 7 సీటర్ కారు.. CNG ఆప్షన్ కూడా?
-
Ranabaali : బుకింగ్స్‌తో సత్తా చాటుతున్న ‘రణబాలి’.. విరోష్’కు స్పెషల్ మైల్ స్టోన్!
ట్రెండింగ్
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!