Site icon NTV Telugu

Palash Muchhal-Smriti Mandhana: మంధాన మధుర జ్ఞాపకాన్ని చెరిపేసిన పలాష్‌ ముచ్చల్‌!

Smriti Mandhana Palash Muchhal

Smriti Mandhana Palash Muchhal

సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్, టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దు అయిన విషయం తెలిసిందే. 2025 నవంబర్ 23న వీరిద్దరూ వివాహం చేసుకోవాల్సి ఉండగా.. అనూహ్య రీతిలో పెళ్లికి కొన్ని గంటల ముందు వాయిదా పడింది. మొదట్లో స్మృతి తండ్రి అనారోగ్య కారణాల వల్ల వివాహం వాయిదా పడిందని వార్తలు రాగా.. ఆపై భారత జట్టు వైస్ కెప్టెన్‌ను పలాష్ మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక డిసెంబర్ 7న పెళ్లి వాయిదా వార్తలపై స్మృతి, పలాష్‌ మొదటిసారి అధికారిక ప్రకటన విడుదల చేశారు. వివాహం రద్దు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో మతిపోయే ఆఫర్.. లక్ష 10 వేల Samsung Galaxy Z Flip 6 ఫోన్ రూ.58 వేలకే!

స్మృతి మంధాన ఇప్పటికే హల్ది, మెహంది వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తొలగించింది. భారత జట్టు ప్లేయర్స్ కూడా వీడియోస్, ఫోటోలను తమ ఖాతాల్లోంచి డిలేట్ చేశారు. తాజాగా పలాష్ ముచ్చల్ కూడా తమ లవ్, పెళ్లికి సంబంధించిన అన్ని ఆధారాలను డిలేట్ చేశాడు. ప్రపోజల్ వీడియోను తొలగించాడు. వన్డే ప్రపంచకప్ విజయోత్సవ క్లిప్ కూడా అతడి ఇన్‌స్టాగ్రామ్‌లో లేదు. పలాష్ మోకరిల్లుతూ స్మృతికి ప్రపోజ్ చేశాడు. ఈ మదుమైన జ్ఞాపకాన్ని ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించాడు. అయితే టైమ్‌లైన్‌లో మాత్రం కొన్ని పోటోలను మనం చూడవచ్చు. పలాష్ అన్ని ఫోటోలు, వీడియోలను తొలగించలేదు.

Exit mobile version