PAK Playing XI vs NAM: నమీబియాతో మ్యాచ్‌.. పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌పై హై డ్రామా!

  • నేడు నమీబియాతో పాకిస్థాన్ కీలక మ్యాచ్‌
  • పాకిస్థాన్ జట్టులో మార్పులపై తీవ్ర చర్చ
  • సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలా? లేదా
Pakistan Team

Pakistan Team

Pakistan Playing XI vs Namibia in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నేడు నమీబియాతో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో మార్పులపై తీవ్ర చర్చ సాగుతోంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలా? లేదా పూర్తి బలంతోనే బరిలోకి దిగాలా? అనే అంశంపై జట్టు మేనేజ్‌మెంట్‌లో ఏకాభిప్రాయం లేకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా హెడ్ కోచ్ మైక్ హెసెన్ మాత్రం సీనియర్ ఆటగాళ్లను కొనసాగించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. కొందరు పీసీబీ అధికారులు మాత్రం సీనియర్స్ వద్దని ఖరాఖండిగా చెబుతున్నారట.

పాకిస్థాన్ కీలక ఆటగాళ్లు బాబర్ ఆజామ్, షాహిన్ షా ఆఫ్రిది, షాబాద్ ఖాన్‌లను నమీబియాతో మ్యాచ్‌లో తప్పకుండా ఆడించాలని హెడ్ కోచ్ మైక్ హెసెన్ చూస్తున్నాడట. గత మ్యాచ్‌లో టీమిండియాపై పేలవ ప్రదర్శన చేసినా.. అనుభవజ్ఞులే జట్టుకు బలం అని హెసెన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. పీసీబీ మేనేజ్‌మెంట్ మాత్రం ఈ ముగ్గురి స్థానాల్లో వేరే వారిని ఆడించాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్ తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది.

Also Read: Australia-Ricky Ponting: సిగ్గుచేటు.. ఆస్ట్రేలియా వైఫల్యానికి అదే ప్రధాన కారణం!

ఫఖర్ జమాన్‌కు ఓపెనర్‌గా అవకాశం దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఫాస్ట్ బౌలర్ నజీమ్ షా కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. యువ ఆటగాళ్లు సాహిబ్జాదా ఫర్హాన్, అబ్రార్ అహ్మద్ తుది జట్టులో చోటు కోల్పోయే ఛాన్సెస్ ఉన్నట్లు సమాచారం. మొత్తానికి నిరాశాజనక ప్రదర్శన చేసినప్పటికీ సీనియర్ ఆటగాళ్లపైనే నమ్మకం ఉంచాలని జట్టు కోచ్ మైక్ హెసెన్ భావిస్తున్నాడు. మరి నమీబియామ్యాచ్‌కు పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌ ఎలా ఉంటుందో చూడాలి. ఈ మ్యాచ్ గెలిస్తే పాక్ సూపర్ 8 చేరుకుంటుంది.