Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్ట్, వన్డే సిరీస్‌లను కోల్పోయిన తర్వాత బాబర్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బాబర్‌ను మూడు ఫార్మాట్‌ల నుంచి కెప్టెన్‌గా తొలగిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబర్ ఆజమ్‌కు మరో కొత్త సమస్య ఎదురవుతోంది. అతడు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. సెక్స్ చాటింగ్ చేస్తూ ఉన్నట్టుగా వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బాబర్‌కు చెందిన అనేక ప్రైవేట్ చిత్రాలు, ఆడియో రికార్డింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి మార్ఫింగ్ అని.. బాబర్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కొందరు పన్నిన కుట్ర అని అభిమానులు ఆరోపిస్తున్నారు.
Read Also: Emergency in Peru : పెరూ రాజధానిలో నెల పాటు ఎమర్జెన్సీ విధింపు
సహచర క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్‌తో సెక్స్ చాటింగ్ చేస్తూ బాబర్ ఆజమ్ దొరికిపోయాడని తెలుస్తోంది. ‘నువ్వు నాతో ఇలాగే సెక్స్ చాటింగ్ చేస్తుంటే.. నీ బాయ్ ఫ్రెండ్ టీమ్‌లో నుంచి బయటకు వెళ్లడు’ అంటూ తోటి క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్‌కు బాబర్ ప్రామిస్ చేశాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే బాబర్ ఆజమ్ గతంలోనే హమీజా ముఖ్తర్ అనే యువతిని వేధించాడని, బెదిరించాడని, బ్లాక్‌మెయిల్ చేశాడనే ఆరోపణలను ఎదుర్కొన్నాడు. బాబర్ తనను లైంగికంగా దూషించాడని కూడా ఆ యువతి ఆరోపించింది. బాబర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. శారీరకంగా దగ్గరయ్యాడని, తర్వాత బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆమె ఆరోపించింది. తాజాగా హనీ ట్రాప్ ఆరోపణల నేపథ్యంలో బాబర్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది మార్చిలో పాకిస్థాన్ సూపర్ లీగ్ ముగిసిన తర్వాత జట్టులో పూర్తి ప్రక్షాళన చేసే అవకాశం కనిపిస్తోంది.
https://twitter.com/niiravmodi/status/1614709104949465088
