Pakistan Match Fixing: పాకిస్థాన్ జట్టులో మరోసారి ఫిక్సింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Cricket Match Fixing: పాకిస్థాన్ క్రికెట్ జట్టును గతంలో పలుమార్లు వెంటాడిన ‘మ్యాచ్ ఫిక్సింగ్’ వివాదం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఇంగ్లాండ్ పర్యటనలో పాక్ వరుస పరాజయాలు చవిచూసిన నేపథ్యంలో.. జట్టులోని కొందరు ఆటగాళ్లపై ఫిక్సింగ్‌కు సంబంధించిన అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాలు ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్థాన్ వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి పాలైంది. ఈ పరాజయాల అనంతరం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించిన పీసీబీ.. స్వదేశానికి పంపింది. వారి స్థానాల్లో కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. మొదట ఈ మార్పులకు ఆటగాళ్ల పేలవ ప్రదర్శనే కారణమని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ నిర్ణయం వెనుక వేరే కారణాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
- Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో కాటేరమ్మ కొడుకు డబుల్ ధమాకా.. 270 పరుగులతో వీర విహారం..
- Ishan Kishan History: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 31 ఏళ్ల తర్వాత..!
- India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
జట్టులోని కొంతమంది ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నించారనే అనుమానాలు పీసీబీకి వచ్చినట్లు పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బోర్డు కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఈ వ్యవహారంపై పీసీబీ అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, ఓపెనర్ ఇమాముల్ హక్ వ్యవహారంపై బోర్డు అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. వీరిద్దరి ప్రవర్తనపై అనుమానాలు తలెత్తడంతో వారి మొబైల్ ఫోన్లను పీసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మహ్మద్ రిజ్వాన్, ఇమాముల్ హక్ మొబైల్ ఫోన్ల నుంచి కీలక సమాచారం బయటకు వెళ్లిందా? అనే కోణంలోనూ పీసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పీసీబీ చేపట్టిన అంతర్గత విచారణపైనే అందరి దృష్టి ఉంది. ఫోన్లు, ఇతర ఆధారాల పరిశీలనలో ఏమైనా కీలక సమాచారం బయటపడితే పాకిస్థాన్ క్రికెట్లో మరోసారి పెను వివాదం చెలరేగే అవకాశం ఉంది. పీసీబీ విచారణ పూర్తయిన తర్వాతే ఈ వ్యవహారంలో అసలు నిజానిజాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Pakistan Match Fixing: పాకిస్థాన్ జట్టులో మరోసారి ఫిక్సింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం!
-
Nora Fatehi Defamation Case: ‘టాయ్ ప్లేన్’ అంటూ వీడియోలు.. ఐటమ్ భామ నోరా ఫతేహిపై రూ.3 కోట్ల పరువు నష్టం కేసు!
-
Telangana Degree PG Colleges Bandh: నేడు డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్.. ఎందుకంటే?
-
9/11 Attacks: 2,976 మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడులు.. వెలుగులోకి సౌదీ మాజీ ఏజెంట్ షాకింగ్ వీడియోలు..
-
Astrology: సెప్టెంబర్ 8 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!