Pakistan: యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 మ్యాచులు జరుగుతున్నాయి. అయితే, ఈ టోర్నీకే హైలెట్‌గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ అత్యంత సునాయాసంగా దాయాదిని మట్టికరిపించింది. ఇదిలా ఉంటే, ఈ ఓటమి కన్నా, పాకిస్తాన్ జట్టును, ఆ దేశాన్ని మరో విషయం తెగ బాధ పెడుతోంది. భారత్ జట్టు ఆటగాళ్లు, పాకిస్తాన్ క్రికెటర్లను కనీసం పట్టించుకోలేదు, ‘‘షేక్ హ్యాండ్’’ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే తీవ్ర వివాదాస్పదంగా మారింది. పాక్ మాజీ క్రికెటర్లు, భారత్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అయితే, ఈ అవమానంతో పాకిస్తాన్ ఆసియా కప్ నుంచి వైదొలగుతామని బెదిరించినట్లు తెలుస్తోంది. చివరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ ఆలోచనపై యూ-టర్న్ తీసుకుంది. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది. అయితే, అందుకు ఐసీసీ ఒప్పుకోలేదు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్ ఇవ్వకపోవడంలో రిఫరీ కీలకంగా వ్యవహరించారని పాకిస్తాన్ కీలక ఆరోపణ. ఆయనను తొలగించకుంటే యూఏఈతో జరగనున్న మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పీసీబీ హెచ్చరించింది. ఐసీసీ పాక్ బెదిరింపుల్ని కనీసం పట్టించుకోలేదు.
Read Also: Telangana : మా పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు ఆడొద్దు” గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రుల ఆవేదన
ఒక వేళ టోర్నీ నుంచి వైదొలిగితే ఐసీసీ తీసుకునే ఆంక్షలకు బలవుతామని భయపడిన పాకిస్తాన్ యూ-టర్న్ తీసుకుందని తెలుస్తోంది. ఆసియా కప్ నుంచి పాక్ జట్టు వైదొలగడం చాలా అరుదు అని పీసీబీ వర్గాలు తెలిపాయి. ఒక వేళ మేము అలా చేస్తే జై షా నేతృత్వంలోని ఐసీసీ పాక్ క్రికెట్ బోర్డుపై భారీ ఆంక్షలు విధించే అవకాశం ఉందని, ఇది మా బోర్డు భరించలేని విషయమని, ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆర్థిక పరిస్థితి బాగా లేదని పీసీబీ వర్గాలు చెప్పాయి.
ఈ అవమానానికి కారణంగా చెబుతూ, పలువురు పాక్ క్రికెట్ అధికారులను పీసీసీ తొలగించేందుకు సిద్ధమైంది. పీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఉస్మాన్ వాల్హా టోర్నీ సమయంలో అనుసరించాల్సిన నియమాలు, నిబంధనల గురించి పాక్ కెప్టెన్‌కు తెలియజేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని కొన్ని మీడియాలు నివేదించాయి. ఈ కారణంగానే వాల్హాను తొలగించాలని పీసీబీ మొహ్సిన్ నఖ్వీ ఆదేశించారని తెలుస్తోంది.
