Site icon NTV Telugu

IND vs SA Final: ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ గెలిచి భారతీయులను సైలెంట్ చేస్తాం..

Ind

Ind

IND vs SA Final: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ తుది ఘట్టానికి చేరుకుంది. కాసేపట్లో (నవంబర్ 2న) ఢిల్లీలోని డీవై పాటిల్ మైదానంలో మధ్యాహ్నం 3గంటలకు జరిగే ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. అయితే, లీగ్ దశలో ఇరు జట్లు పోటీ పడగా.. వాటిలో ప్రోటీస్ జట్టు గెలిచింది. ఈ క్రమంలో నేడు ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. కాగా, ఇరు జట్లు సెమీఫైనల్ లో అద్భుత విజయాలతో తుది పోరుకు అర్హత సాధించాయి.

Read Also: KTR: బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా.. కేటీఆర్ రియాక్షన్ ఇదే..

అయితే, ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టోర్నమెంట్ కూడా గెలవని భారత మహిళల జట్టు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తుంది. మరోవైపు సౌతాఫ్రికా కూడా టైటిల్ కొట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫైనల్ కి ముందు జరిగిన ప్రెస్ మీట్ లో ప్రొటీస్ కెప్టెన్ లారా మాట్లాడుతూ.. సొంత మైదానంలో ఆడడం వల్ల భారత్ పై తీవ్ర ఒత్తిడి ఉంటుంది.. ఆ జట్టు గెలవాలని దేశం మొత్తం ఆశిస్తుంది పేర్కొనింది. కానీ ఇవి కేవలం అంచనాలు మాత్రమే.. వాళ్ల ఒత్తిడే మాకు అనుకూలంగా మారుతుందని తెలిపింది. నేను ఈ మ్యాచ్ కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా.. భారత్ ని ఓడించాలంటే మేము చాలా కష్టపడాల్సి ఉంది.. కానీ ఈ గొప్ప ఛాన్స్ కోసం మేము రెడీగా ఉన్నాం.. ఈ ఫైనల్ లో హార్మన్ ప్రీత్ కౌర్ సేనను ఓడించి భారత క్రికెట్ అభిమానులను సైలెంట్ చేస్తామని సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ వెల్లడించింది.

Read Also: Sandeep Reddy : నేను డైరెక్టర్ అవ్వ‌డానికి కారణం ఈ మూవీనే – సందీప్ రెడ్డి వంగా

ఇక, గత ప్రపంచ కప్ ఫైనల్, సెమీ ఫైనల్స్ లో తమ జట్టు ఓటమి నుంచి ఏర్పడిన అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా గుర్తు చేసుకుంది. మేము ఫైనల్ కి చేరిన తొలిసారి మా మనసులో ట్రోఫీ గెలవాలనే ఉత్సాహం ఉండేది.. కానీ, ఇప్పుడు మేం ఓ నాణ్యమైన జట్టుతో ఈ తుది పోరులో ఆడబోతున్నాం.. ఈ రోజు మ్యాచ్ లో ఏం చేయాలనే దానిపై ప్రధానంగా దృష్టి పెట్టాను.. ఏం చేసినా అంతా స్లోగా చేయాలని అనుకుంటున్నాను అని సౌతాఫ్రికా కెప్టెన్ వోల్వార్డ్ చేసిన కామెంట్స్ తో కాసేపట్లో జరగబోయే ఫైనల్ మ్యాచ్ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

Exit mobile version