NTV Telugu Site icon

Shoaib Akhtar : విరాట్ కోహ్లీ దెయ్యం.. టెండుల్కర్ రికార్డ్ దాటేస్తాడు..

Shoyab Akthar

Shoyab Akthar

వన్డేల్లో వరుసగా మూడు సెంచరీలు చేసి.. టెస్టు సెంచరీ అందుకోవడానికి చాలా సమయం తీసుకున్న విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగవ మ్యాచ్ లో దాన్ని కూడా తీర్చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు విరాట్ కోహ్లీ 100 సెంచరీల రికార్డును అందుకుంటాడా? లేదా? అనే విషయం మీద చర్చ జోరుగా సాగుతుంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన క్రికెటర్ గా రెండో స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు. అయితే సచిన్ 100 సెంచరీల రికార్డును అందకోవాలంటే మరో 25 శతకాలు చేయాల్సి ఉంటుంది.

Also Read : MM. Keeravani: ఇది లోకంలోనే అత్యంత అరుదైన గిఫ్ట్… నా కన్నీళ్లు ఆగడం లేదు

గత మూడేళ్లుగా సెంచరీ మార్క్ అందుకోవాడానికి కోహ్లీ పడిన ఇబ్బంది చూసిన అభిమానులు.. మరో 25 సెంచరీలు అంటే కష్టమేనని డిసైడ్ అయిపోయారు. సచిన్ టెండూల్కర్ రికార్డును అందుకోకపోయినా, మాస్టర్ తర్వాత మనోడేనని ఫిక్స్ అయిపోయారు. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మాత్రం విరాట్ కోహ్లీ, సచిన్ రికార్డ్ బ్రేక్ చేస్తాడని భరోసా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీ లెజెండరీ క్రికెటర్.. అందులో ఎలాంటి సందేహం లేదని అంటున్నాడు. కోహ్లీతో పోటీపడే ప్లేయర్ నాకెవ్వరు కనిపించడం లేదు.. ఎందుకంటే మూడు ఫార్మాట్లలో విరాట్ లా ఆడటం, ఇన్నేళ్లు ఆడటం అంత తేలికైన విషయం కాదు.. అతని అంకితభావం, ఫిట్ నెస్ వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి అని షోయబ్ అక్తర్ అన్నారు.

Also Read : Cristiano Ronaldo : సహనం కోల్పోయిన రోనాల్డ్.. ఫుట్ బాల్ పై కోపం..

విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ లోకి రావడం తనకేమీ వింతగా అనిపించడం లేదని షోయబ్ అక్తర్ అన్నారు. ఇన్నాళ్లు కెప్టెన్సీ ప్రెషర్ తో బాగా ఆడలేకపోయాడు.. ఇప్పుడు అతను కెప్టెన్ కాదు.. ఫ్రీగా బ్యాటింగ్ పైనే ఫోకస్ పెట్టగలుగుతున్నాడు.. విరాట్ వంద సెంచరీలు కొడతాడని తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన అన్నారు. సచిన్ టెండూల్కర్ 100 అంతర్జాతీయ సెంచరీలు కొట్టాడు.. విరాట్ కోహ్లీ వంద కాదు.. 110 సెంచరీలు కొడతాడు.. కెప్టెన్సీ ప్రెషర్ లేకపోతే అతనిలో ఉన్న దెయ్యం బయటికి వస్తుంది.. దానికి పరుగుల దాహం చాలా ఎక్కువ దాని ఆకలి ఎప్పుడు తీరుతుందో చెప్పలేం అంటూ పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నారు.