NTV Telugu Site icon

Sydney Test: కెప్టెన్ రోహిత్ శర్మను అవమానించారు.. బీసీసీఐపై సిద్ధూ సీరియస్

Siddu

Siddu

Sydney Test: ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటం లేదు. ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతున్న రోహిత్‌ను పక్కన పెట్టాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు ప్రచారం కొనసాగుతుంది. ఆ ప్రచారానికి తగినట్లు గానే టాస్ సమయంలో మ్యాచ్‌కు దూరంగా ఉండాలని రోహిత్ నిర్ణయించుకున్నారని జస్ప్రీత్ బూమ్రా తెలపడంతో అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్ తుది జట్టులోకి రావడం హాట్ టాపిక్ గా మారింది.

Read Also: Chiranjeevi : చిరంజీవితో సినిమాపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి

అయితే, రోహిత్ శర్మ తనకు తాను తప్పుకున్నాడా? లేక అతడ్ని తీసేశారా ? అనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ పరిణామాలపై పలువురు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా రోహిత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.. రోహిత్ శర్మను కోచ్ గౌతమ్ గంభీర్ అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. హిట్ మ్యాన్ లాంటి ప్లేయర్‌ను బెంచ్ మీద కూచోబెట్టడం దారుణమంటూ మండిపడ్డారు. ఇంత కంటే ఘోరం ఉండదు.. టీమ్‌‌కు కెప్టెన్‌గా ఉన్న ఆటగాడిని ఆడించకపోవడం కంటే పెద్ద తప్పు ఇంకా ఏం లేదన్నారు. ఇది తప్పుడు సంకేతాలు పంపిస్తుందని గంభీర్‌పై నవజ్యోత్ సింగ్ సిద్దు ఫైర్ అయ్యారు. రోహిత్‌కు కనీస గౌరవం ఇవ్వాలి. అతడు జట్టుకు ఎన్నో విజయాలు అందించాడని మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చారు.

Read Also: Donald Trump: హష్ మనీ కేసులో జనవరి 10న కోర్టుకు ట్రంప్.. శిక్ష విధిస్తామని తెలిపిన కోర్టు

ఇక, జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ప్లేయర్ ను సిరీస్ మధ్యలో ఇలా తీసేయడం పద్దతికాదన్నారు. తనంత తాను పక్కకు జరిగే ఛాన్స్ కూడా ఇవ్వకూడదన్నారు. క్రికెట్ చరిత్రలో ఇంతకు ముందు ఇలా ఎప్పుడు జరగలేదని తెలిపారు. మార్క్ టేలర్, మహ్మద్ అజహరుద్దీన్ లాంటి కెప్టెన్లను చాలా మందిని చూశా.. వాళ్లు ఫామ్ లేమితో ఏడాదికి పైగా జట్టులో కొనసాగారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలా అవమానకరంగా రోహిత్ శర్మన పక్కకు జరపడం మంచింది కాదు.. కోచ్ గంభీర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని నవజ్యోతి సింగ్ సిద్ధూ వెల్లడించారు.