Gautam Gambhir: నేను మనిషినే.. నేను కూడా తప్పులు చేసి ఉండొచ్చు.. విరాట్, రోహిత్ వివాదంపై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir on Virat Kohli & Rohit Sharma: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మకు ఎప్పుడూ పొసగదని.. వారి మధ్య ఏదో జరుగుతుందని పుకార్లు షికార్లు చేయగా.. కొన్ని సార్లు అది బహిర్గతం కూడా అయ్యింది.. అయితే, విరాట్, రోహిత్‌తో తన సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గంభీర్.. గత కొంతకాలంలో తాను కూడా కొన్ని తప్పులు చేసి ఉండవచ్చని ఆయన అంగీకరించారు. అంతేకాదు.. నేను మనిషినే.. నేను కూడా తప్పులు చేసి ఉండొచ్చు అని పేర్కొన్నారు..
రెవ్‌స్పోర్ట్జ్ కాన్క్లేవ్లో గంభీర్ వ్యాఖ్యలు
మార్చి 16న కోల్‌కతాలో జరిగిన RevSportz Conclaveలో మాట్లాడిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. ఆటగాళ్లతో వ్యవహరించే విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఎల్లప్పుడూ మంచి ఉద్దేశ్యంతోనే తీసుకున్నానని తెలిపారు. “నేను కూడా మనిషినే. నేను తప్పులు చేయొచ్చు. ఆటగాళ్లకు కూడా తప్పులు చేసే హక్కు ఉంది. గత 18 నెలల్లో నేను కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. కానీ, నా ఉద్దేశాలు ఎప్పుడూ సరైనవే. మంచి ఉద్దేశ్యంతో తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని అంగీకరించవచ్చు. అయితే, చెడు ఉద్దేశ్యంతో తీసుకున్న నిర్ణయం మాత్రం డ్రెస్సింగ్ రూమ్‌లో ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు” అని గంభీర్ అన్నారు. అంతేకాదు.. డ్రెస్సింగ్ రూమ్ ముందు నిలబడి ఆటగాళ్ల కళ్లలోకి చూసి నిజాయితీగా మాట్లాడగలిగితేనే కోచ్‌గా తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తున్నానని గంభీర్ పేర్కొన్నారు.
Also Read
- Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
- BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్‌లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
- Shresta Iyer: శ్రేయస్ అయ్యర్ సోదరికి అత్యాచార బెదిరింపులు.. శ్రేష్ఠ అయ్యర్ ఆవేదన
కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ తర్వాత మార్పులు
గంభీర్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలలకే విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఈ నిర్ణయం 2024–25లో జరిగిన.. Border–Gavaskar Trophyలో భారత జట్టు నిరాశపరిచిన ప్రదర్శన తర్వాత వచ్చింది. అలాగే న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా భారత్ ఆశించిన ఫలితాలు సాధించలేదు. దీంతో బీసీసీఐ జట్టు ప్రదర్శనను సమీక్షించి కొన్ని కొత్త మార్గదర్శకాలను అమలు చేసింది.
యువ ఆటగాళ్లకు అవకాశాలు
కోహ్లీ, రోహిత్ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత భారత టెస్ట్ జట్టులో మార్పుల దశ ప్రారంభమైంది. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వగా, శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. గంభీర్, గిల్ నాయకత్వంలో భారత్ ఇంగ్లాండ్ పర్యటనలో టెస్ట్ సిరీస్‌ను డ్రా చేసుకుంది. అలాగే స్వదేశంలో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో జట్టు పరాజయం చవిచూసింది. మరోవైపు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. భారత జట్టుకు వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నారు. ఇద్దరూ ICC Cricket World Cup 2027పై దృష్టి సారించారు. అయితే, ప్రపంచకప్ జట్టులో వారి స్థానం ప్రదర్శన ఆధారంగానే నిర్ణయిస్తామని జట్టు మేనేజ్మెంట్, సెలెక్టర్లు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!