APL 2026: చివరి బంతి వరకు ఉత్కంఠ.. తుంగభద్ర వారియర్స్ సంచలన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీఎల్ 2026 సీజన్-5లో తుంగభద్ర వారియర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్‌లో రాయల్స్ ఆఫ్ రాయలసీమపై చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠభరిత పోరులో తుంగభద్ర వారియర్స్ విజయం సాధించింది. టాస్ గెలిచిన తుంగభద్ర వారియర్స్ కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు ఆరంభంలో మంచి ప్రదర్శన కనబరిచింది. తొలి 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా సాగుతున్నట్లు కనిపించింది. అయితే చివరి దశలో తుంగభద్ర బౌలర్లు అద్భుతంగా పుంజుకుని ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు.
రాయలసీమ జట్టులో ధ్రువ్ కుమార్ రెడ్డి అర్థశతకంతో రాణించాడు. అతడు మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మరోవైపు రషీద్ 31 బంతుల్లో 41 పరుగులు చేసి జట్టుకు మద్దతుగా నిలిచాడు. అయితే మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో రాయల్స్ ఆఫ్ రాయలసీమ 18.2 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది. తుంగభద్ర బౌలర్లలో సాయి చరణ్, దీపక్ స్టీఫెన్ తలో రెండు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించారు.
Also Read
- India’s 80-Year Sports Journey: హాకీ స్వర్ణయుగం నుంచి క్రికెట్ సామ్రాజ్యం వరకు.. 80 ఏళ్ల భారత క్రీడా ప్రస్థానం..
- Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- ISSF World Cup2026: ISSF వరల్డ్ కప్‌లో భారత్ డబుల్ ధమాకా.. ఈషాకు గోల్డ్, మనుకు బ్రాంజ్.!
ఇక, 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తుంగభద్ర వారియర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. టాప్ ఆర్డర్ బ్యాటర్లు త్వరగా పెవిలియన్ చేరడంతో జట్టు ఒత్తిడిలో పడింది. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడి జట్టును పోటీలో నిలిపారు. సూర్య జయంత్ 25 బంతుల్లో 26 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగా, రోహిత్ కేవలం 14 బంతుల్లో 24 పరుగులు చేసి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చాడు. చివర్లో సౌరబ్ 15 బంతుల్లో 21 పరుగులు చేసి అద్భుత ఫినిషింగ్ ఇచ్చాడు. ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో కీలక సమయంలో జట్టును విజయ తీరాలకు చేర్చాడు చివరి బంతికి విజయం కోసం అవసరమైన పరుగును సాధించిన తుంగభద్ర వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. దీంతో ఏపీఎల్ 2026 సీజన్-5లో తమ తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మ్యాచ్‌లో కీలక సమయంలో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన సౌరబ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
తాజావార్తలు
-
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
-
B – Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
-
Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
-
BYD Sealion 7 Dynamic Launch: BYD సీలియన్ 7 డైనమిక్ విడుదల.. 71.8kWh బ్యాటరీ, 520KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!