APL 2026: మంగళగిరిలో ఏపీఎల్ జోష్.. సెమీస్, ఫైనల్‌కు భారీ ఏర్పాట్లు
- ఏపీఎల్ ఫైనల్‌కు మంగళగిరి సిద్ధం..
- 10 వేల మంది కోసం ఏర్పాట్లు..
- ఉచిత రవాణాపై ఏసీఏ ఆలోచన..
- అమరావతిని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APL 2026: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని చిన్ని ఏపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై కీలక వివరాలు వెల్లడించారు. జూన్ 24 నుంచి 30 వరకు మంగళగిరి స్టేడియంలో ఏపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయని తెలిపారు. కడపలో జరిగిన మ్యాచ్‌లకు మంచి స్పందన లభించిందని చెప్పారు. ఏపీఎల్ సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లను మంగళగిరి స్టేడియంలో నిర్వహించనున్నట్లు కేశినేని చిన్ని వెల్లడించారు. స్టేడియంలో సుమారు 10 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్‌లను వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ప్రేక్షకులకు ఉచిత రవాణాపై ఆలోచన
మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చే అభిమానుల కోసం ఉచిత రవాణా సదుపాయం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు కేశినేని చిన్ని.. ఈ విషయంపై ఆర్టీసీ అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇక, ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని కేశినేని చిన్ని తెలిపారు. ఈ టోర్నీని మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Also Read
మంగళగిరిలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు ప్రణాళిక
భవిష్యత్‌లో మంగళగిరి స్టేడియంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మ్యాచ్‌లు నిర్వహించే ఆలోచన కూడా ఉందన్నారు. విశాఖ స్టేడియంకు ఏమాత్రం తీసిపోకుండా మంగళగిరి స్టేడియాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి చేసి, అంతర్జాతీయ మ్యాచ్‌లకు అనువైన స్టేడియాన్ని నిర్మించనున్నట్లు కేశినేని చిన్ని వెల్లడించారు. అలాగే తిరుపతి, కాకినాడలో కూడా కొత్త స్టేడియాల నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
APL 2026: మంగళగిరిలో ఏపీఎల్ జోష్.. సెమీస్, ఫైనల్‌కు భారీ ఏర్పాట్లు
-
Israel-Lebanon: శాంతి ఒప్పందానికి తూట్లు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
-
Ex-Terrorist: ఉగ్రవాదుల జేబుల్లో కండోమ్, ప్రేమ లేఖలు..ధురంధర్లో చూపించి నిజమే: మాజీ ఉగ్రవాది..
-
Sajjala Ramakrishna Reddy: గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం.. వైసీపీ కొత్త వ్యూహం
-
Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!