PCB Chairman: పీసీబీ ఛైర్మన్ సంచలన నిర్ణయం.. రేసు నుంచి వైదొలుగుతున్నా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Najam Sethi quits PCB Chairman Race: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాత్కాలిక ఛైర్మన్ నజమ్ సేథీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పీసీబీ ఛైర్మన్‌కు సంబంధించి జరగనున్న ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తాను పీసీబీ బోర్డులో శాశ్వత స్థానాన్ని కోరుకోవడం లేదని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని నజమ్ సేథీ మంగళవారం స్వయంగా ట్విటర్ వేదికగా తెలిపాడు. దాంతో ఛైర్మన్‌గా జకా అష్రాఫ్‌ను మరోసారి నియమించేందుకు మార్గం సుగమమైంది.
‘అందరికీ నమస్కారం. నేను అసీప్ జర్దారీ, షహబాజ్ షరీఫ్‌ల మధ్య వివాదానికి కారణం కాకూడదని అనుకుంటున్నా. ఇలాంటి అస్థిరత, అనిశ్చితి పీసీబీకి ఏమాత్రం మంచిది కాదు. నేను పీసీబీ ఛైర్మన్ రేసు నుంచి వైదొలుగుతున్నా. మిగిలిన వారందరికీ ఆల్ ది బెస్ట్’ అంటూ సోమవారం రాత్రి ఓ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసియా కప్ 2023కు ముందు పీసీబీ చైర్మెన్ రేసు నుంచి నజమ్ సేథీ తప్పుకోవడం ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also Read
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
Also Read: Weight Loss Tips: రాత్రి పడుకునే ముందు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే బరువు పెరగడం ఖాయం!
పాకిస్థాన్‌లోని పాలక సంకీర్ణ ప్రభుత్వంలోని రెండు పార్టీలు అయిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీలు బోర్డు ఛైర్మన్‌గా తమ వ్యక్తులే ఉండాలని పట్టుబట్టాయి. దాంతో పీసీబీలో అనిశ్చితి ఏర్పడింది. ఈ క్రమంలోనే తాత్కాలిక ఛైర్మన్ నజమ్ సేథీ రేసు నుంచి వైదొలిగాడు. 2022 డిసెంబర్‌లో రమీజ్ రాజా ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నాక ప్రధాని షాబాజ్ షరీఫ్.. నజమ్ సేథీని తాత్కాలిక ఛైర్మన్‌గా ఎంపిక చేశాడు. ఇక ఛైర్మన్ పదవికి ఎన్నికలు జరిగేంతవరకు సేథీ తాత్కాలిక ఛైర్మన్‌గా ఉంటాడు.
ఆరు నెలల కాలంలో నజమ్ సేథీ పీసీబీలో తనదైన ముద్ర వేశాడు. మికీ ఆర్థర్‌ను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా, గ్రాంట్ బ్రాడ్‌బర్న్ హెడ్ కోచ్‌గా, మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేయడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఆసియా కప్ 2023 హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించే ప్రతిపాదన కూడా సేథీదే. ఏసీసీని ఒప్పించి ఆసియా కప్ హైబ్రీడ్ మోడ్‌లో జరిగేలా చూశాడు. అంతేకాదు పీసీబీలో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నాడు.
Salaam everyone! I don’t want to be a bone of contention between Asif Zardari and Shehbaz Sharif. Such instability and uncertainty is not good for PCB. Under the circumstances I am not a candidate for Chairmanship of PCB. Good luck to all stakeholders.
— Najam Sethi (@najamsethi) June 19, 2023
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!