NTV Telugu Site icon

PCB Chairman: పీసీబీ ఛైర్మన్‌ సంచలన నిర్ణయం.. రేసు నుంచి వైదొలుగుతున్నా!

Najam Sethi Pcb

Najam Sethi Pcb

Najam Sethi quits PCB Chairman Race: పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తాత్కాలిక ఛైర్మన్‌ నజమ్‌ సేథీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పీసీబీ ఛైర్మన్‌కు సంబంధించి జరగనున్న ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తాను పీసీబీ బోర్డులో శాశ్వత స్థానాన్ని కోరుకోవడం లేదని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని నజమ్‌ సేథీ మంగళవారం స్వయంగా ట్విటర్‌ వేదికగా తెలిపాడు. దాంతో ఛైర్మన్‌గా జకా అష్రాఫ్‌ను మరోసారి నియమించేందుకు మార్గం సుగమమైంది.

‘అందరికీ నమస్కారం. నేను అసీప్‌ జర్దారీ, షహబాజ్‌ షరీఫ్‌ల మధ్య వివాదానికి కారణం కాకూడదని అనుకుంటున్నా. ఇలాంటి అస్థిరత, అనిశ్చితి పీసీబీకి ఏమాత్రం మంచిది కాదు. నేను పీసీబీ ఛైర్మన్‌ రేసు నుంచి వైదొలుగుతున్నా. మిగిలిన వారందరికీ ఆల్ ది బెస్ట్’ అంటూ సోమవారం రాత్రి ఓ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసియా కప్‌ 2023కు ముందు పీసీబీ చైర్మెన్ రేసు నుంచి నజమ్ సేథీ తప్పుకోవడం ప్రభావం చూపే అవకాశం ఉంది.

Also Read: Weight Loss Tips: రాత్రి పడుకునే ముందు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే బరువు పెరగడం ఖాయం!

పాకిస్థాన్‌లోని పాలక సంకీర్ణ ప్రభుత్వంలోని రెండు పార్టీలు అయిన పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ, పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌ పార్టీలు బోర్డు ఛైర్మన్‌గా తమ వ్యక్తులే ఉండాలని పట్టుబట్టాయి. దాంతో పీసీబీలో అనిశ్చితి ఏర్పడింది. ఈ క్రమంలోనే తాత్కాలిక ఛైర్మన్‌ నజమ్‌ సేథీ రేసు నుంచి వైదొలిగాడు. 2022 డిసెంబర్‌లో రమీజ్‌ రాజా ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకున్నాక ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌.. నజమ్‌ సేథీని తాత్కాలిక ఛైర్మన్‌గా ఎంపిక చేశాడు. ఇక ఛైర్మన్‌ పదవికి ఎన్నికలు జరిగేంతవరకు సేథీ తాత్కాలిక ఛైర్మన్‌గా ఉంటాడు.

ఆరు నెలల కాలంలో నజమ్‌ సేథీ పీసీబీలో తనదైన ముద్ర వేశాడు. మికీ ఆర్థర్‌ను డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా, గ్రాంట్‌ బ్రాడ్‌బర్న్‌ హెడ్‌ కోచ్‌గా, మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్‌ కోచ్‌గా ఎంపిక చేయడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఆసియా కప్‌ 2023 హైబ్రీడ్‌ మోడ్‌లో నిర్వహించే ప్రతిపాదన కూడా సేథీదే. ఏసీసీని ఒప్పించి ఆసియా కప్‌ హైబ్రీడ్‌ మోడ్‌లో జరిగేలా చూశాడు. అంతేకాదు పీసీబీలో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నాడు.

Also Read: Pat Cummins Yorker: ప్యాట్‌ కమ్మిన్స్‌ సూపర్‌ యార్కర్‌.. ఇంగ్లండ్ బ్యాటర్‌ మైండ్‌ బ్లాంక్‌! వీడియో వైరల్