AUS vs ZIM: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. ఆస్ట్రేలియాపై జింబాంబ్వే విజయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో సంచలనం నమోదయింది. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై పసికూన జింబాంబ్వే విజయం సాధించింది. 170 పరుగుల లక్ష ఛేదనలో ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో జింబాంబ్వే 23 పరుగుల తేడాతో గెలిచింది. జింబాంబ్వే బౌలర్లలో ముజారబానీ 4 వికెట్స్ పడగొట్టగా.. బ్రాడ్ ఎవాన్స్ 3 వికెట్లతో సత్తాచాటాడు. మాట్ రెన్షా (65) ఆసీస్ తరఫున హాఫ్ సెంచరీ బాదాడు.
గ్రూప్-Bలో భాగంగా కొలంబోలో ఆస్ట్రేలియా, జింబాంబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాంబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 169 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్; 56 బంతుల్లో, 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. తాదివనాషే మారుమణి (35, 21 బంతుల్లో, 7 ఫోర్లు), ర్యాన్ బర్ల్ (35; 30 బంతుల్లో 4 ఫోర్లు), సికిందర్ రాజా (25 నాటౌట్; 13 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మార్కస్ స్టోయినిస్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు.
Also Read
- Tilak vs Vaibhav: ఏంటిది వైస్ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్!
- Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
- Fatima Sana: భారత్‌తో మ్యాచ్‌లో అదే మా కొంపముంచింది.. ఏడ్చేసిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా!
- Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
ఛేదనలో ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. జోష్ ఇంగ్లిస్ (8), కామెరూన్ గ్రీన్ (0), టీమ్ డేవిడ్ (0) విఫలమయ్యారు. ట్రావిస్ హెడ్ (17) కూడా నిరాశపరిచాడు. ముజారబానీ, ఎవాన్స్ కలిసి ఆసీస్ టాప్ ఆర్డర్ బ్యాటర్లను ఎత్తేశారు. ఈ సమయంలో మాట్ రెన్‌షా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (31) జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ నెమ్మదిగా ఆడడంతో చేయాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. మ్యాక్స్‌వెల్, రెన్‌షా అవుట్ అయ్యాక.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో ఆసీస్ ఓడక తప్పలేదు. ముజర్బానీ (4/17) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడితో పాటు ఇవాన్స్, మసకద్జ, బర్ల్ కూడా బంతితో రాణించారు.
తాజావార్తలు
-
Tilak vs Vaibhav: ఏంటిది వైస్ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్!
-
Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్‌పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
-
Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
-
Shruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్‌కు భారీ ఊరట!
-
SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్‌లు.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!