బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. 2026 ఐపీఎల్ కోసం ముస్తాఫిజుర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రూ.9.20 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై హింస తర్వాత ఐపీఎల్‌లో ముస్తాఫిజుర్ ఆడదాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశంలో నిరసనలు చెలరేగాయి. దాంతో ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాలని కేకేఆర్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశించింది. బీసీసీఐ నిర్ణయంతో ముస్తాఫిజుర్ భారీ మొత్తంలో డబ్బు కోల్పోనున్నాడు. ముస్తాఫిజుర్ మొత్తం ఏడు ఐపీఎల్ సీజన్‌లలో ఆడాడు కానీ.. ఇంత ఎక్కువ ధరకు బిడ్ అందుకోవడం ఇదే మొదటిసారి. అయితే బంగ్లా బౌలర్ ఇప్పటివరకు ఐపీఎల్ నుంచి ఎంత సంపాదించాడో తెలుసుకుందాం.
Also Read: Sara Arjun: ప్రభాస్, విజయ్‌లను బీట్ చేసిన ‘ధురంధర్’ భామ సారా అర్జున్!
ముస్తాఫిజుర్ రెహమాన్ తొలిసారిగా 2016లో ఐపీఎల్ ఆడాడు. ఆ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. సన్‌రైజర్స్ అతన్ని రూ.1.40 కోట్లకు కొనుగోలు చేసింది. 2017 సీజన్‌లో కూడా అదే మొత్తానికి ఆడాడు. 2018 ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ రూ.2.20 కోట్లకు దక్కించుకుంది. ముస్తాఫిజుర్ 2019-20 సీజన్‌లో ఆడలేదు. ఐపీఎల్ 2021లో రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ.1 కోటికి కొనుగోలు చేసింది. 2022, 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. ఒక్కో సీజన్‌కు రూ.2 కోట్లు చెల్లించింది. 2024లో చెన్నై సూపర్ కింగ్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025లో ఆడలేదు. ఐపీఎల్ 2026లో రూ.9.20 కోట్లు కేకేఆర్ దక్కించుకుంది. అనివార్య కారణాల వల్ల కేకేఆర్ విడుదల రిలీజ్ చేయడంతో.. ఆ మొత్తాన్ని అందుకోలేడు. ముస్తాఫిజుర్ మొత్తంగా ఏడు ఐపీఎల్ సీజన్‌లలో రూ.12 కోట్లు సంపాదించాడు.
