బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. 2026 ఐపీఎల్ కోసం ముస్తాఫిజుర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రూ.9.20 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై హింస తర్వాత ఐపీఎల్‌లో ముస్తాఫిజుర్ ఆడదాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశంలో నిరసనలు చెలరేగాయి. దాంతో ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాలని కేకేఆర్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశించింది. బీసీసీఐ నిర్ణయంతో ముస్తాఫిజుర్ భారీ మొత్తంలో డబ్బు కోల్పోనున్నాడు.…