Site icon NTV Telugu

GT vs MI: గుజరాత్ టైటాన్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం

Mi Won The Match

Mi Won The Match

Mumbai Indians Won The Match By 27 Runs Against Gujarat Titans: మే 12వ తేదీన వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. ముంబై నిర్దేశించిన 219 పరుగుల లక్ష్యాన్ని ఛేధించలేకపోయింది. 20 ఓవర్లలో 191 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. 27 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. నిజానికి.. 108 పరుగులకే జీటీ 8 వికెట్లు కోల్పోవడంతో, భారీ తేడాతో ముంబై విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, రషీద్ ఖాన్ ముంబై ఆశలపై నీళ్లు చల్లేశాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అతగాడు.. ఊచకోత కోశాడు. ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 32 బంతుల్లోనే 3 ఫోర్లు 10 సిక్సులతో 79 పరుగులు చేశాడు. అల్జారి జోసెఫ్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కి 88 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. తన జట్టుని ఆలౌట్ కానివ్వకుండా, చివరివరకు క్రీజులో నిలబడి, ఒంటరి పోరాటం కొనసాగించాడు. అతడు పోరాడిన తీరుకి.. ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే!

Anakapalle Crime: చార్జింగ్‌ తీయకుండా ఫోన్‌ మాట్లాడాడు.. ప్రాణాలు కోల్పోయాడు

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 103) శతక్కొడటంతో పాటు ఇషాన్ కిషన్ (31), రోహిత్ శర్మ (29), విష్ణు వినోద్ (30) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. ముంబై అంత భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి, 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముంబై బౌలర్ల ధాటికి టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. మధ్యలో విజయ్ శంకర్ (29), డేవిడ్ మిల్లర్ (41) మెరుపులు మెరిపించారు కానీ.. ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. ముంబై బౌలర్ల మాయాజాలం ముందు.. గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. 13.2 ఓవర్లలో 103 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. అది చూసి.. ముంబై భారీ పరుగుల తేడాతో గుజరాత్‌పై ఘనవిజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. టాపార్డరే విఫలమైనప్పుడు.. టైలెండర్లను ఔట్ చేయడం పెద్ద సమస్య కాదని భావించారు.

Ileana: తొలిసారి బేబీ బంప్ తో ఇలియానా.. ఇప్పటికైనా చెప్పు ఆ బిడ్డకు తండ్రి ఎవరు..?

కానీ.. రషీద్ ఖాన్ ఆ అంచనాలను తిప్పేశాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతగాడు.. వచ్చి రావడంతోనే ముంబై బౌలర్లపై విరుచుకుపడటం మొదలుపెట్టాడు. ముంబై బౌలర్లు అతడ్ని ఔట్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అతడు మైదానంలో సిక్సుల వర్షం కురిపించాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 సిక్సులు ఉన్నాయంటే.. ఏ రేంజ్‌లో ఊచకోత కోశాడో మీరే అర్థం చేసుకోండి. 108/8 వద్ద ఉన్న గుజరాత్ జట్టుని అతడు తన ఒంటరి పోరాటంతో 20 ఓవర్లలో 191/8 వద్దకు తీసుకొచ్చాడు. అంతకుముందు బౌలింగ్‌లోనూ 4 వికెట్లు సత్తా చాటిన రషీద్.. బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించి, ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచాడు. ఇక ముంబై బౌలర్ల విషయానికొస్తే.. ఆకాశ్ మధ్వాల్ 3 వికెట్లు తీయగా.. పియూష్ చావ్లా, కార్తికేయ చెరో రెండు వికెట్లు.. జేసన్ ఒక వికెట్ పడగొట్టారు.

Exit mobile version