టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షితో కలిసి చేసిన ఓ సరదా ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంబానీ కుటుంబం నిర్వహించిన నవరాత్రి మేళాకు ఆదివారం (అక్టోబర్ 18) ధోనీ, సాక్షి హాజరయ్యారు. రిలయన్స్ గ్రీన్స్‌లో జరిగిన ఈ వేడుకల్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సంప్రదాయ సంగీతం, గర్బా నృత్యాలు, వినోదభరితమైన ఆటలు, రకరకాల రైడ్లతో ఈ వేడుకలు సందడిగా సాగాయి.
వేడుకలో ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షికి ఐస్‌క్రీమ్ తినిపించేందుకు సిద్దమయ్యాడు. అయితే ఆమె తినబోతున్న సమయంలో ఐస్‌క్రీమ్‌ను ఉన్న చేసితిని వెనక్కి లాగి.. అతడే తినేశాడు. ఇలా రెండు మూడు సార్లు చేయడంతో సాక్షి నవ్వులు పూయించారు. మైదానంలో ఎంతో ప్రశాంతంగా, గంభీరంగా కనిపించే ధోనీ.. భార్యతో ఉన్నప్పుడు ఇలా సరదాగా వ్యవహరించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ చిన్నపాటి ప్రాంక్‌కు సంబంధించిన వీడియోను నెటిజన్లు షేర్ చేస్తూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ యాంగిల్ కూడా ఉందా? బాసూ అంటూ కెమెంట్స్ చేస్తున్నారు.
రిలయన్స్ గ్రీన్స్‌లో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన మరికొన్ని వీడియోల్లోనూ ఎంఎస్ ధోనీ, సాక్షి, అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ కలిసి సందడి చేస్తూ కనిపించారు. రాత్రి సుమారు 2 గంటల సమయంలోనూ వారు పలు వినోద కార్యక్రమాలు, రైడ్లను ఆస్వాదించారు. అంబానీ కుటుంబం నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో క్రికెట్, వ్యాపార, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు సందడి చేశారు. సంప్రదాయ సంగీతం, గర్బా నృత్యాలు, వినోద కార్యక్రమాలతో పాటు ప్రత్యేక రైడ్లు అతిథులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో ధోనీ తన భార్య సాక్షితో కలిసి సరదాగా గడిపిన క్షణాలు మాత్రం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వైరల్ అవుతున్నాయి. మైదానంలో తన వ్యూహాలతో అభిమానులను ఆకట్టుకునే ధోనీ.. వ్యక్తిగత జీవితంలోని ఇలాంటి సరదా క్షణాలతోనూ అందరి దృష్టిని ఆకర్షించాడు.
MS Dhoni and Sakshi. 🤣❤️ https://t.co/bdTMi3rWg0
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2026

