మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరులో ఉన్న ఆ వైబ్రేషన్సే వేరు. కెప్టెన్‌గా టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన ధోనీ.. ఐపీఎల్‌లోనూ తన చెన్నై జట్టుని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. తన కెప్టెన్సీలో ఆ జట్టుని నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఇప్పుడు తన పేరిట మరో రికార్డ్‌ని లిఖించుకున్నాడు. లీగ్ ఆరంభం నుంచే కెప్టెన్‌గా ఉన్న ధోనీ.. బుధవారం (మే 4) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పోరుతో సీఎస్కే తరఫున 200వ మ్యాచ్ పూర్తి చేసుకున్నాడు.
Read Also: High Court: హైకోర్టులో చింతమనేని ప్రభాకర్‌కు ఊరట
నిజానికి.. ఈ ఐపీఎల్ సీజన్‌లో ధోనీ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే! దీంతో, అతని స్థానంలో జడేజాను కెప్టెన్‌గా నిర్వహించారు. అయితే, ఈ కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా తాను ఆటపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోతుండడం వల్ల.. జడేజా తిరిగి కెప్టెన్సీ బాధ్యతల్ని ధోనీకే అప్పగించాడు. ధోనీ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత జట్టులో తిరిగి పూర్వవైభవం తిరిగొచ్చింది. ఇదిలావుండగా, బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ధోనీ మరో నాలుగు పరుగులు చేస్తే.. కోహ్లీ తర్వాత 6 వేల పరుగులు సాధించిన కెప్టెన్‌గా ధోనీ రికార్డులకెక్కుతాడు.
ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 199 మ్యాచులాడిన ధోనీ, 40.67 సగటుతో 4312 పరుగులు చేశాడు. అటు, కోహ్లీ 190 మ్యాచ్‌ల(185 ఇన్నింగ్స్)లో కలిపి ఐదు సెంచరీలు, 48 అర్ధ శతకాల సాయంతో 6451 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక వీరిద్దరి తర్వాత స్థానంలో భారత జట్టు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ(4721) పరుగులతో ఉన్నాడు.