MS Dhoni New Look: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన ఆటతీరుతో పాటు సింప్లిసిటీతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవల్ అని చెప్పాలి. ఇక, మహేంధ్రుడి హెయిర్ స్టైల్ గురించి కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే.. ధోనీ ఎప్పుడూ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌తో అభిమానుల్ని ఫుల్ ఖుషీ చేస్తుంటారు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో లాంగ్ హెయిర్‌తో కనిపించిన తలా.. ఇప్పుడు కొత్త లుక్ లోకి వచ్చేశాడు. హెయిర్ మొత్తం కట్ చేసి యంగ్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
Read Also: Chuttamalle : చుట్టమల్లే సాంగ్ ఇంగ్లీష్ వెర్షన్… వావ్ సూపర్ ఓ లుక్కేయండి
ఇక, స్టైలిష్ లుక్‌తో మహేంద్ర సింగ్ ధోని అట్రాక్ట్ చేస్తున్నాడు. అచ్చం హాలీవుడ్ యాక్టర్‌లా కనబడుతున్నారు. ధోనీ కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ గా మారిపోయాయి. ఇవి చూసిన ఆయన అభిమానులు అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నావ్, లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్ల సునామీ సృష్టిస్తున్నారు. అయితే, మైదానంలో తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న ఎంఎస్ ధోనీ.. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉంటున్నారు. కేవలం ఐపీఎల్ సీజన్‌లో మాత్రమే ఆడుతున్నారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తరపున ఆడుతున్నారు. ఐపీఎల్ మినమా మిగతా సమయంలో తన విలువైన సమయాన్ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కోసం ధోనీ కేటాయిస్తుంటారు. ఇక, మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా తన ఫ్యాన్స్ తో టచ్‌లో ఉంటున్నారు.
Xtreme Cool! 🦁🥶 @msdhoni
📸 : @AalimHakim pic.twitter.com/mARUefmpYd— Chennai Super Kings (@ChennaiIPL) October 12, 2024