Mohammed Siraj: టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీని భారత్ సమం చేయడంలో మహ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఈ ట్రోఫీలో భాగంగా ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఓడిపోతామని అనుకున్న చోట సిరాజ్ తన బౌలింగ్‌తో మ్యాజిక్ చేసేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసుకుని టీమిండియాకు మరుపురాని విజయాన్ని అందించాడు. మొత్తానికి ఈ మ్యాచ్‌లో సిరాజ్ మియా 9 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ ఒక్క మ్యాచ్‌లోనే కాదు సిరీస్ మొత్తం 23 వికెట్లు తీసిన మంచి ప్రదర్శన కనబరిచాడు. దీంతో, ఇప్పుడు అతడి ఫిట్‌నెస్ గురుంచి చర్చ కొనసాగుతుంది. ఈ సిరీస్‌లో తన సహచర ఆటగాళ్లు ఫిట్‌నెస్ సమస్యలతో దూరమైనప్పటికి.. సిరాజ్ మాత్రం ఓ యోధుడిలా అన్ని మ్యాచ్‌లల్లోనూ బౌలింగ్ చేశాడు.
Read Also: Adilabad Police: పోలీసుల మజాకా..! కటౌట్‌లతో ప్రమాదాల కట్టడి..!
ఇక, ఇంగ్లండ్ – భారత్ టెస్టు సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన ఏకైక బౌలర్‌గా మహ్మద్ సిరాజ్ నిలిచాడు అని చెప్పాలి. ఎలాంటి వర్క్ లోడ్ లేకుండా ఈ సిరీస్‌లో దాదాపు వెయ్యికి పైగా బాల్స్ వేశాడు. కానీ, ఎప్పుడూ కూడా మియా భాయ్ అలిసిపోయినట్లు కనిపించలేదు.. ఇక, సిరాజ్ ఫిట్‌నెస్ సీక్రెట్‌ను అతడి సోదరుడు మహ్మద్ ఇస్మాయిల్ రివీల్ చేశాడు. సిరాజ్ తన ఫిట్‌నెస్‌పై ఎక్కువగా నజర్ పెడతాడు.. జంక్ ఫుడ్ (పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్)కు చాలా దూరంగా ఉంటాడు.. సరైన డైట్ ప్లాన్‌ను ఫాలో అవుతాడు అని చెప్పుకొచ్చాడు, అలాగే, సిరాజ్ హైదరాబాద్‌లో ఉన్నా, బయట ఎక్కడున్నా బిర్యానీని చాలా తక్కువగా తింటాడు.. అది కూడా ఇంట్లో తాయారు చేస్తేనే తింటాడు అని వెల్లడించారు. కానీ, తన శరీరం పట్ల చాలా క్రమశిక్షణతో ఉంటాడని సిరాజ్ సోదరుడు తెలియజేశాడు.
