Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Mohammed Shamis India Return In Doubt As Bcci Selectors Ignore Him Again

Mohammed Shami: అయ్యో పాపం.. ఇక షమీని భారత జెర్సీలో చూడలేమా?

Published Date :January 5, 2026 , 9:11 am
By Sampath Kumar
  • అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ ఒకడు
  • షమీ నైపుణ్యం, రికార్డులు అద్భుతం
  • షమీని పట్టించుకోని బీసీసీఐ సెలక్టర్లు
Mohammed Shami: అయ్యో పాపం.. ఇక షమీని భారత జెర్సీలో చూడలేమా?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

టీమిండియా అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్లలో ‘మహ్మద్‌ షమీ’ ఒకడు. అతడి నైపుణ్యం, రికార్డులు అద్భుతం. అయితే ఇటీవలి కాలంలో వరుస గాయాలతో భారత జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఫిట్‌గా ఉన్న 35 ఏళ్ల షమీ.. దేశవాళీల్లోనూ సత్తా చాటుతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో వికెట్స్ తీస్తూ.. తాను ఉన్నా అంటూ బీసీసీఐ సెలక్టర్లకు హెచ్చరికలు పంపుతున్నాడు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని పట్టించుకోవడం లేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఇక షమీని భారత జెర్సీలో చూడలేమా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

మహ్మద్‌ షమీ చివరగా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో ఆడాడు. ఆ టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఆపై బీసీసీఐ సెలక్టర్లు అతడిని పక్కనపెట్టారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు. స్వయంగా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ సైతం షమీ ఫిట్‌నెస్‌పై సందేహాలు వ్యక్తం చేశాడు. ఆపై సొంతగడ్డపై వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లకు ఎంపిక చేయలేదు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో అవకాశం ఇవ్వలేదు. దేశవాళీల్లో సత్తాచాటుతున్నా త్వరలో జరగనున్న న్యూజిలాండ్‌తో సిరీస్‌కు పక్కన పెట్టారు. గౌతమ్‌ గంభీర్‌ హెడ్ కోచ్‌ అయ్యాక షమీకి వచ్చిన అవకాశాలు చాలా తక్కువ.

Also Read

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
  • SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
  • India-Pakistan: "పాకిస్తాన్‌తో ఆడేది లేదు".. కేంద్రం సంచలన నిర్ణయం..
Add as a preferred
source on google

Also Read: Minors Living Together: హైదరాబాద్‌లో ‘మరో చరిత్ర’.. సహజీవనం చేస్తున్న మైనర్లు!

భారత జట్టులో చోటు కోసం మహ్మద్‌ షమీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 2025 సయ్యద్ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో ఇవ్వరు వరకు 5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. దేశవాళీలో షమీ బెంగాల్‌ జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే. కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్‌ చేయడం షమీ ప్రత్యేకత. మంచి ఫిట్‌నెస్‌, ఫామ్ ఉన్నా.. ఎందుకో మరి బీసీసీఐ సెలెక్టర్లు షమీని పట్టించుకోవడం లేదు. ఇదే కొనసాగితే.. ఇక షమీని భారత జెర్సీలో చూడలేము. చూడాలి మరి ఏం జరుగుతుందో.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bcci
  • ind vs nz
  • Mohammed Shami
  • Mohammed Shami dropped
  • Shami Comeback News

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions