టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ చాలా సందర్భాల్లో జట్టును గెలిపించాడు. ఐసీసీ టోర్నీల్లో కూడా టీమిండియాకు మంచి ప్రదర్శన చేసాడు. తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయాలలో కూడా కీ రోల్ పోషించాడు. అయితే తన క్రికెట్ కేరీర్ బాగానే వున్నా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు వున్నాయి.ముఖ్యంగా భార్యతో విడాకులు గొడవ తనను కృంగదీసింది. ఇప్పుడు అదే విషయంలో షమీకి హైకోర్టు షాక్ ఇచ్చింది.
మొహమ్మద్ షమీ, తన భార్య హసీన్ జహాన్ 2014లో వివాహం చేసుకున్నారు. 2015లో వీరికి ఒక కుమార్తె ఐరా జన్మించింది. అయితే 2018 నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో హసీన్ జహాన్, షమీపై గృహ హింస, కట్నం వేధింపులు, ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు మరియు మ్యాచ్ ఫిక్సింగ్ వంటి తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, షమీపై కేసు నమోదైంది. అప్పట్లో బీసీసీఐ కూడా ఈ ఆరోపణలపై విచారణ జరిపింది. అయితే తరువాత షమీకి క్లీన్ చిట్ ఇచ్చింది.కానీ ఇప్పటికి ఈ విడాకులు కేసు నడుస్తూనే వుంది.
Thummala Nageswara Rao: రాష్ట్రంలో యూరియా కొరత.. మరోమారు కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల..!
అయితే 2018లో ఈ కేసును విచారించిన అలిపోర్ కోర్టు. షమీ నెలకు తన భార్యకు 50,000 మరియు కుమార్తె ఐరాకు 80,000 భరణం చెల్లిచాలని తీర్పిచ్చింది.కానీ ఈ తీర్పుతో అసంతృప్తి చెందిన హసిన్ జహాన్ తనకి 10 లక్షలు భరణం కావాలని కోల్కత్తా హైకోర్టును ఆశ్రయించింది. ఇక ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్ట్, షమీ 2021లో సుమారుగా 7.19 కోట్లు సంపాదించినట్టు ఆదాయపు పన్ను వివరాల ద్వారా వెల్లడైంది.ఇక అతడి భార్య కూడా, ప్రస్తుతం తన కుమార్తెతో నివసించటం దాంతోపాటూ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో షమీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని, తన భార్యకు నెలకు 1.5 లక్షలు మరియు కూతురు సంరక్షణ కోసం 2.5 లక్షలు కలిపి మొత్తం 4 లక్షలు భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
తాజాగా జరిగిన ఈ విచారణలో కోల్కోత్త హైకోర్ట్ ఈ తీర్పుని వెల్లడించింది. ఇక మొహమ్మద్ షమీ గాయం కారణంగా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళలేదు. దీంతో తిరిగి ఫిట్నెస్ సాధించి మళ్ళీ ఇండియన్ టీంలో చోటు సంపాదించాలని చూస్తున్నాడు.
Minister Vakiti Srihari: బనకచర్ల, బీసీ అంశాలపై మంత్రి కీలక వ్యాఖ్యలు..!
