Team India: 200 వికెట్స్ తీసినా విలువ లేదా.. ఇక రిటైర్ అవ్వడమే బెటరా?
- కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు లేదు
- వన్డే సిరీస్‌లో మూల్యం చెల్లించుకున్న టీమిండియా
- ఇక కుల్దీప్ రిటైర్ అవవడమే బెటరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో కూడా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కారణంగా కుల్దీప్కు ప్లేయింగ్ 11లో ఆడలేదు. గాయం కారణంగా సుందర్ మూడో మ్యాచ్‌లో ఆడకున్నా.. కుల్దీప్కు అవకాశం రాలేదు. లార్డ్స్ మైదానంలో యువకులను ఆడించిన టీమిండియా మూల్యం చెల్లించుకుంది. కుల్దీప్కు అవకాశం రాకపోవడంపై మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన కైఫ్.. వరుసగా అవకాశాలు ఇవ్వకుండా పక్కన పెడుతుంటే కుల్దీప్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని సూచిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి వంటి ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా కుల్దీప్ యాదవ్‌కు జట్టులో చోటు కల్పించకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని కైఫ్ పేర్కొన్నాడు. ‘కుల్దీప్ యాదవ్ ఇప్పుడు తన బ్యాగులు సర్దుకుని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాలా అనే ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బుమ్రా లేడు, వాషింగ్టన్ లేడు, వరుణ్ కూడా లేడు. అయినా కుల్దీప్కు తుది జట్టులో స్థానం దక్కలేదు. లార్డ్స్‌లో భారత బౌలింగ్ ఒకే తరహాలో కనిపించింది. ఎడమచేతి రిస్ట్ స్పిన్నర్ ఉంటే జట్టుకు ఎంతో ఉపయోగపడేవాడు. 118 వన్డేల్లో 194 వికెట్లు తీసిన రికార్డులు కూడా ఇప్పుడు విలువలేనివిగా కనిపిస్తున్నాయి’ అని ‘ఎక్స్’లో కైఫ్ రాసుకొచ్చాడు.
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
కుల్దీప్ను వరుసగా పక్కన పెట్టడంపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఫైర్ అయ్యాడు. ‘కుల్దీప్ను ఆడించకపోవడానికి బ్యాటింగ్ డెప్త్ అవసరమనే కారణం చెప్పారు. కానీ ఇప్పుడు అర్ష్‌దీప్ సింగ్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న పరిస్థితి వచ్చింది. బుమ్రా కూడా లేని సమయంలో కుల్దీప్కు అవకాశం ఇవ్వకపోవడం బాధాకరం. ఇలాంటి నిర్ణయాలు బౌలర్ ఆత్మవిశ్వాసం, లయపై ప్రతికూల ప్రభావం చూపుతాయి’ అని యాష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో కుల్దీప్కు టీ20 సిరీస్‌లో విశ్రాంతిని ఇచ్చింది. వన్డే సిరీస్‌లో ఉన్నా కూడా ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. మూడు వన్డేల్లోనూ అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు.
జట్టు యాజమాన్యం బ్యాటింగ్ డెప్త్ కోసం అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు ప్రాధాన్యం ఇస్తుండగా.. కుల్దీప్ ప్రధాన బలం అయిన స్పిన్ బౌలింగ్‌కు తగిన గుర్తింపు దక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 118 వన్డేల్లో 194 వికెట్లు సాధించిన కుల్దీప్.. భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన మ్యాచ్ విన్నర్‌గా గుర్తింపు పొందాడు. అయినప్పటికీ వరుసగా అవకాశాలు దక్కకపోవడంతో అతని భవిష్యత్తుపై ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మహ్మద్ కైఫ్, రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు జట్టు ఎంపిక విధానంపై మరోసారి చర్చకు దారితీశాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు