IND Vs SL: రెండో రోజు ముగిసిన ఆట.. కష్టాల్లో శ్రీలంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. టీమిండియా కంటే ఇంకా 466 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక వెంట వెంటనే టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా… రవీంద్ర జడేజా, బుమ్రా తలో వికెట్ తీశారు. కరుణరత్నే, తిరుమన్నే, ఎంజెలో మాథ్యూస్, ధనుంజయ డిసిల్వా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ప్రస్తుతం నిస్సాంక, అసలంక క్రీజులో ఉన్నారు. మూడోరోజు ఉదయం సెషన్లో టీమిండియా బౌలర్లు మంచి ప్రదర్శన చేస్తే శ్రీలంకకు ఈ టెస్టులో ఓటమి తప్పకపోవచ్చు.
అటు రెండో రోజు ఉదయం సెషన్లో భారత బ్యాటింగ్ జోరుగా సాగింది. రవీంద్ర జడేజా సూపర్ ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా భారీస్కోర్ సాధించింది. ఏడో స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజాకు లోయర్ ఆర్డర్ నుంచి పూర్తి సహకారం లభించింది. దీంతో అతడు 228 బంతుల్లో 3 సిక్సులు, 17 ఫోర్లతో 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత ఇన్నింగ్స్‌లో హనుమ విహారి 58, విరాట్ కోహ్లీ 45, రిషబ్ పంత్ 96, అశ్విన్ 61 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.
Also Read
- KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..
- KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
- KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్‌లో హైవోల్టేజ్ పోరు.. టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
- Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్‌లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!