NTV Telugu Site icon

Moeen Ali: ఇంగ్లండ్‌తో కష్టమే.. భారత్ జాగ్రత్త!

Moeen Ali On Ind Vs Eng

Moeen Ali On Ind Vs Eng

భారత్, ఇంగ్లండ్ మధ్య రేపటి (జులై 1) నుంచి ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ మోయిన్ అలీ భారత్‌ను హెచ్చరించాడు. ఇంతకుముందు కంటే ఇంగ్లండ్ జట్టు ఇప్పుడు పటిష్టంగా తయారైందని, ఇటీవల న్యూజీల్యాండ్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ ఆ జట్టు మరింత జోష్ మీద ఉందని, అలాంటి ఇంగ్లండ్‌ను ఆపడం చాలా కష్టమేనని అభిప్రాయపడ్డాడు.

ఒకవేళ గతేడాదే ఈ ఐదో టెస్ట్ మ్యాచ్ జరిగి ఉంటే, టీమిండియాకే అనుకూలమైన ఫలితం వచ్చేదని.. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవని అంచనా వేశాడు.ఇప్పుడున్న ఇంగ్లండ్ జట్టు లోడెడ్ గన్‌లా తయారైందని, ఎవరెదురెళ్లినా దాని ఫైరింగ్ ముందు నిలబడలేరని మోయిన్ చెప్పాడు. దీనికితోడు రోహిత్ శర్మ, కేఎల్ శర్మ దూరం అవ్వడం.. భారత్‌కు మరింత మైనస్ అవుతుందన్నాడు. గతేడాదితో పోలిస్తే ఇంగ్లండ్‌ మైండ్‌‌సెట్‌ పూర్తిగా మారిందని, ఎదురుదాడినే ప్రధాన అస్త్రంగా వినియోగిస్తుందని తెలిపాడు. రేపట్నుంచి జరగబోయే మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టే ఫేవరెట్‌ అని మోయిన్ అలీ జోస్యం చెప్పాడు.

కాగా.. గతేడాది జరగాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్‌ను కరోనా కారణంగా ఈ ఏడాది రీషెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే! ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఇండియా గెలిచినా, డ్రాగా ముగిసినా.. భారత్‌దే సిరీస్ కైవసం అవుతుంది. అలా కాకుండా చేయాలంటే, ఇంగ్లండ్ తప్పకుండా ఈ మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. అప్పుడు సిరీస్ 2-2తో సమం అవుతుంది. మరి.. ఎలాంటి ఫలితం నమోదవుతుందో చూడాలి.