టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి.. భారత్‌ను శుభారంభాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి… 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకోగా.. ఈ ఈవెంట్‌లో చైనా వెయిట్‌లిఫ్టర్ ఝిహుయి హౌ గోల్డ్ గెలిచింది. కానీ, ఆమెకు యాంటీ డోపింగ్ పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు.. ఇప్పటికే మీరాబాయి చాను.. టోక్యో నుంచి భారత్‌కు చేరుకోగా… టోక్యోలోనే ఉండాల్సిందిగా హౌను ఆదేశించారు ఒలింపిక్స్ నిర్వహకులు. ఈ టెస్టులో ఒక వేళ స్వర్ణ పతక విజేత డోపీగా తేలితే.. మీరాబాయి చానుకు స్వర్ణం దక్కే ఛాన్స్ ఉంది. కాగా, ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను మొత్తం 202 కేజీల బరువు ఎత్తగా.. హౌకు 210 కేజీలు ఎత్తి స్వర్ణ పతకాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
‘సిల్వర్’ మీరాబాయికి గోల్డ్ మెడల్..?

Mirabai Chanu