Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Mentally Disturbing We Fell Short In Finding Ways To Win Rohit Sharma

Rohit Sharma: ఈ ఓటమి మానసికంగా వేధిస్తోంది.. నితీష్ రెడ్డి పోరాటం అద్భుతం..!

Published Date :December 30, 2024 , 2:04 pm
By Chandra Shekhar Pamena
  • ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో ఓటమిపై రోహిత్‌ శర్మ తీవ్ర విచారం..
  • మ్యాచ్ గెలిచేందుకు వేసిన ప్రణాళికలు సరిగ్గా అమలు చేయలేక పోయాం..
  • ఈ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు: రోహిత్ శర్మ
Rohit Sharma: ఈ ఓటమి మానసికంగా వేధిస్తోంది.. నితీష్ రెడ్డి పోరాటం అద్భుతం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rohit Sharma: బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్టులు ఆడుతుంది. మొదటి టెస్టులో గెలిచిన తర్వాత అడిలైడ్‌లో ఓడింది. అనంతరం బ్రిస్బేన్‌ టెస్టును డ్రాగా ముగించుకున్న టీమిండియా మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో మాత్రం 184 రన్స్ తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. భారీ లక్ష్యం ముందున్నా చివరి వరకు పోరాడాలని నిశ్చయించుకున్నాం.. కానీ, ప్రణాళికలు సరిగ్గా అమలు చేయలేకపోయామన్నారు. ఏదేమైనా ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా ఆడి.. మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారని తెలిపాడు. ఈ ఓటమి చాలా బాధాకరంగా ఉంది. మానసికంగా వేధిస్తోందని చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌ గెలిచేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి.. కానీ మేము మాత్రం విజయానికి దారిని వెతకలేకపోయామని రోహిత్ శర్మ వెల్లడించారు.

Read Also: Ethiopia: ఇథియోపియాలో ఘోర ప్రమాదం.. 71మంది మృతి

అయితే, ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పోరాడిన తీరు అసాధారణం అని రోహిత్ శర్మ తెలిపారు. ముఖ్యంగా చివరి వికెట్‌కు అద్భుతం చేశారు. ఇక, ఆఖరి రోజు 340 పరుగుల లక్ష్యం ఛేదించడం అంత ఈజీ కాదని మాకు తెలుసు. అయినా, అందుకు పునాది వేసేందుకు బాగా శ్రమించాం.. కానీ ఆసీస్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో తాము అనుకున్న టార్గెట్ చేరలేకపోయామని అతడు పేర్కొన్నాడు. ఇక, తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో చెలరేగిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి తొలిసారి ఆసీస్ గడ్డపై టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్నా.. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడన్నారు. ఇక, నితీష్ కుమార్ రెడ్డి భవిష్యత్ లో విజయవంతమైన ఆల్‌రౌండర్‌గా ఎదిగే అన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి.. రోజు రోజుకూ అతడు మరింత మెరుగుపడాలని రోహిత్ శర్మ తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aus vs Ind
  • Border Gavaskar Trophy
  • Boxing Day Test
  • ind vs aus
  • rohit sharma

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions