LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!
- చెపాక్‌లో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ
- పవర్‌ప్లేలోనే రికార్డు స్కోరు నమోదు చేసిన లక్నో
- మధ్య ఓవర్లలో సీఎస్కే కంబ్యాక్.. వరుస వికెట్లు కోల్పోయిన ఎల్ఎస్జీ
- షాబాజ్ అహ్మద్ మెరుపు ఫినిషింగ్‌తో 200 దాటిన లక్నో స్కోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LSG vs CSK : ఐపీఎల్ ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. చెన్నై బౌలర్లను ఉతికేస్తూ కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఇంగ్లిస్, ముఖ్యంగా రివర్స్ స్వీప్స్ , స్కూప్ షాట్లతో మైదానాన్ని హోరెత్తించాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికి లక్నో ఒక వికెట్ నష్టానికి 91 పరుగులు చేసి, చెపాక్ స్టేడియంలోనే అత్యధిక పవర్‌ప్లే స్కోరు నమోదు చేసిన జట్టుగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంగ్లిస్ మొత్తం 33 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 85 పరుగులు చేసి జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
ఇంగ్లిస్ అవుట్ అయిన తర్వాత లక్నో ఇన్నింగ్స్ ఒక్కసారిగా నెమ్మదించింది. నికోలస్ పూరన్ (1), రిషబ్ పంత్ (15) తక్కువ పరుగులకే వెనుదిరగడంతో లక్నో మధ్య ఓవర్లలో తడబడింది. చెన్నై బౌలర్లు జేమీ ఓవర్టన్, అన్షుల్ కంబోజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టి లక్నోను ఒత్తిడిలోకి నెట్టారు. ఒక దశలో 112 పరుగులకే ఒక వికెట్ కోల్పోయి అత్యంత పటిష్టంగా ఉన్న లక్నో, 154 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ కష్ట సమయంలో షాబాజ్ అహ్మద్ బాధ్యతాయుతంగా ఆడి జట్టును ఆదుకున్నాడు. 25 బంతుల్లో 43 పరుగులు చేసిన షాబాజ్, ఇన్నింగ్స్ చివరి బంతికి భారీ సిక్సర్ బాది జట్టు స్కోరును 200 మార్కు దాటించాడు. హిమ్మత్ సింగ్ కూడా 17 పరుగులతో విలువైన సహకారాన్ని అందించాడు.
Also Read
- Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
- Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
- Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
చెన్నై బౌలర్లలో జేమీ ఓవర్టన్ 36 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. నువాన్ తుషార , ముఖేష్ చౌదరి వికెట్లు తీయలేకపోవడమే కాకుండా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మొత్తానికి ఇంగ్లిస్ విధ్వంసం, షాబాజ్ మెరుపులతో లక్నో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఇప్పుడు 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ స్కోరును ఎలా ఛేదిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?