NTV Telugu Site icon

Lionel Messi: మెస్సీ కారును చుట్టుముట్టిన అభిమానులు.. వీడియో వైరల్..

Messi

Messi

Lionel Messi’s Car Gets Mobbed By Fans In Rosario: ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఎక్కడికి వెళ్లినా అభిమాన సంద్రం ఎదురవుతోంది. తనను కలిసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడుతున్నారు. ఇటీవల ఖతార్ లో జరిగిన ఫిపా వరల్డ్ కప్-2022లో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపాడు. ఫైనల్స్ లో ఫ్రాన్స్ ను చిత్తు చేసి 36 ఏళ్ల తరువాత తన దేశానికి వరల్డ్ కప్ అందించారు. ఈ గెలుపు నుంచి అర్జెంటీనాలో అభిమానులు సంబరాలు చేసుకుంటూనే ఉన్నారు. ఇటీవల రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో లక్షలాది మంది అభిమానుల సమక్షంలో ఫుట్ బాల్ ఆటగాళ్ల బృందం విజయోత్సవ ర్యాలీ జరిగింది. చివరకు అభిమానులు చుట్టుముట్టడంతో మెస్సీని అక్కడ నుంచి హెలికాప్టర్ లో తరలించాల్సి వచ్చింది.

Read Also: DGP Mahender Reddy: దేశ వ్యాప్తంగా నిందితుల డేటాబేస్ మన దగ్గర ఉంది

ఇదిలా ఉంటే మెస్సీ ఇటీవల తన సొంత ప్రాంతం అయిన రోసారియోకు వెళ్లారు. ఈ విషయం తెలిసిన అభిమానులు మెస్సీకారును అడ్డగించి మెస్సీపై అభిమానాన్ని చాటుతూ.. నినాదాలు చేశారు. దీనికి మెస్సీ కూడా తన అభివాదాన్ని తెలియజేశాడు. తన మేనకోడలు 15వ పుట్టిన రోజుకు పార్టీకి హాజరయ్యేందుకు రోసారియోకు వెళ్లారు.

ఖతార్ ప్రపంచకప్ లో మెస్సీ గోల్డెన్ బాల్ ను గెలుచుకున్నాడు. ఫ్రాన్స్ తో ఫైనల్ మ్యాచ్ లో స్కోర్లు సమం కావడంతో ఫెనాల్టీ షూటౌట్ లో ఫ్రాన్స్ ను 4-2 తేడాతో ఓడించింది అర్జెంటీనా లా అల్బిసెలెస్ట్, డిగో మారడోనా తర్వాత అర్జెంటీనాకు ప్రపంచకప్ అందిచారు లియోనెల్ మెస్సీ. అప్పటి నుంచి స్వదేశంలో ఎక్కడికి వెళ్లినా మెస్సీని అభిమానులు వెంబడిస్తూనే ఉన్నారు.