IPL 2022: బుమ్రా పాంచ్ పటాకా వృథా.. ముంబైకి 9వ ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్లో సోమవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓ దశలో 200 స్కోరు చేసేలా కనిపించిన కోల్‌కతా తక్కువ పరుగులు చేసిందంటే దానికి కారణం బుమ్రా. అతడు 4 ఓవర్లు బౌలింగ్ వేసి ఓ మెయిడిన్ సహా 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాకుండా ఐదు వికెట్లు పడగొట్టడంతో కోల్‌కతా మిడిలార్డర్, లోయరార్డర్ రాణించలేకపోయింది. వెంకటేష్ అయ్యర్ (43), నితీష్ రాణా (43) హాఫ్ సెంచరీలు చేయలేకపోయారు.
అనంతరం 166 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని సైతం ఛేదించలేక 113 పరుగులకే ముంబై ఇండియన్స్ కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (2) మరోసారి విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్ (51) రాణించినా అతడికి సహకారం అందించేవారు కరువయ్యారు. ఇషాన్ కిషన్ తర్వాత జట్టులో అత్యధిక స్కోరు పొలార్డ్ (15)దే అంటే ముంబై బ్యాటింగ్ ఎలా ఉందో ఊహించుకోవచ్చు. కోల్‌కతా బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా ఆండీ రసెల్ రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో కోల్‌కతా పాయింట్ల టేబుల్లో 5 విజయాలు, 7 పరాజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతా జట్టు ప్లే ఆఫ్స్ చేరాలంటే అద్భుతమే జరగాలి. అటు టోర్నీలో ముంబై ఇండియన్స్‌కు ఇది 9వ ఓటమి. ఆ జట్టు పాయింట్ల టేబుల్లో కేవలం 4 పాయింట్లతో అట్టడుగున ఉంది.
Also Read
- SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
- Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
Virat Kohli: కోచ్ అంటే ఇలా ఉండాలి.. నెట్టింట్లో వీడియో వైరల్
తాజావార్తలు
-
Explainer: రోజురోజుకీ మరింత పవర్‌ఫుల్‌గా మారుతున్న AIతో మనిషి ఉనికికే ముప్పు రానుందా?
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
-
Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్ప్లే, 108MP కెమెరా
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
ట్రెండింగ్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!