Amanpreet Singh Gill: విరాట్ కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు కన్నుమూత

Amanpreet Singh Gill

Amanpreet Singh Gill

భారత అండర్-19 మాజీ ఆటగాడు, పంజాబ్ మీడియం పేసర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ బుధవారం చండీగఢ్‌లో 36 ఏళ్ల వయసులో మరణించారు. గిల్ మరణం క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. విరాట్ కోహ్లీ మాజీ అండర్-19 సహచరుడైన గిల్, పంజాబ్ తరఫున ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. తొలి ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ ఫ్రాంచైజీ కింగ్స్ XI పంజాబ్ తరఫున కూడా ఆడాడు. ఆ తర్వాత పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా పనిచేశాడు.

పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ట్విట్టర్‌ పోస్ట్ లో “పంజాబ్ మాజీ క్రికెటర్, పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడు అమన్‌ప్రీత్ సింగ్ గిల్ దుర్మరణం పట్ల పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది. దుఃఖంలో ఉన్న కుటుంబానికి, ప్రియమైన వారికి మా హృదయపూర్వక సంతాపం. వాహేగురు గిల్ ఆత్మకు శాశ్వత శాంతిని ప్రసాదించి, ఈ కష్టకాలంలో కుటుంబం అందరికీ బలాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నామని తెలిపింది. భారతదేశానికి రెండుసార్లు ప్రపంచ కప్ అందించిన ఆల్-రౌండర్ యువరాజ్ సింగ్ కూడా గిల్‌కు నివాళులర్పించారు.