KL Rahul: పెద్ద ఆటగాడు.. అంతకంటే పెద్ద మనసు.. ఇది నిజమైన కేఎల్ క్లాస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul Smartphone Gift: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన మంచి మనసును చాటుకున్నాడు. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ‘గేమ్ ఛేంజర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డుగా అందుకున్న స్మార్ట్‌ఫోన్‌ను ఓ మహిళా అధికారికి బహుమతిగా ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్నాడు. రాహుల్ చేసిన ఈ అనూహ్యమైన పనికి సదరు అధికారి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోషల్ మీడియాలో పంచుకుంది.
‘కేఎల్ రాహుల్ అవార్డుగా అందుకున్న ఫోన్‌ను నాకు ఇచ్చేశారు. నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. రాహల్ ది గొప్ప మనసు. నిజంగా ఆయన నుంచి ఇలాంటి బహుమతిని ఊహించలేదు’ అని సదరు మహిళా అధికారి వీడియోలో పేర్కొంది. రాహుల్ మంచి మనసును బీసీసీఐ కూడా ప్రత్యేకంగా ప్రశంసించింది. ‘పెద్ద ఆటగాడు.. అంతకంటే పెద్ద మనసు. ఇది నిజమైన కేఎల్ క్లాస్’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇక వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ డక్‌వర్త్ లూయిస్ (డీఎల్ఎస్) పద్ధతిలో నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలగడంతో డీఎల్ఎస్ పద్ధతిలో ఫలితాన్ని నిర్ణయించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.
Also Read
- IPL 2027 Retentions: రూ.20 కోట్ల ఆటగాళ్లకు ఉద్వాసన.. ఇక పక్కకెళ్లి ఆడుకోండమ్మా!
- Ajinkya Rahane: "బుమ్రా, భువీ కాదు.. అతడే డేంజరస్ బౌలర్".. మనసులో మాట బయటపెట్టిన రహానే..
- Sunil Gavaskar: శుభ్‌మన్ గిల్ తప్పేమీ లేదు.. ఇదేం కొత్తేమీ కాదు!
- IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ గుర్నూర్ బ్రార్ అద్భుత ప్రదర్శన చేశాడు. తన కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేస్తూ 30 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 41 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. డారిల్ మిచెల్ 55 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఔకిబ్ నబీ, అన్షుల్ కాంబోజ్ చెరో రెండు వికెట్లు తీశారు. 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ 30 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో భారత్ విజయానికి చేరువైంది. అయితే చివర్లో న్యూజిలాండ్ బౌలర్లు మళ్లీ పుంజుకుని భారత జట్టును 113/7కు పరిమితం చేశారు. అదే సమయంలో వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. అప్పటికి డీఎల్ఎస్ పార్ స్కోరుకంటే భారత్ నాలుగు పరుగుల ఆధిక్యంలో ఉండటంతో విజయం టీమిండియాను వరించింది.
Big player. Bigger heart 💙
🎥 An act of kindness and pure 𝙆𝙇𝙖𝙨𝙨 🙌
#TeamIndia | #NZvIND | @klrahul https://t.co/BgT005WZlp
— BCCI (@BCCI) November 8, 2026
తాజావార్తలు
-
KL Rahul: పెద్ద ఆటగాడు.. అంతకంటే పెద్ద మనసు.. ఇది నిజమైన కేఎల్ క్లాస్!
-
IPL 2027 Retentions: రూ.20 కోట్ల ఆటగాళ్లకు ఉద్వాసన.. ఇక పక్కకెళ్లి ఆడుకోండమ్మా!
-
CM Revanth Reddy 57th Birthday: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు..
-
Hyderabad: ఏఐ ఫొటో తెచ్చిన ప్రాణసంకటం.. ప్రిన్సిపల్, లెక్చరర్ వేధింపులతో విద్యార్థి బలి
-
IAF Creates History: చైనా సరిహద్దుల్లో హిస్టరీ క్రియేట్ చేసిన భారత వాయుసేన.. 13,629 అడుగుల ఎత్తులో గజరాజ్ ల్యాండింగ్!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!