Site icon NTV Telugu

KL Rahul : ఐపీఎల్ నుంచి కేఎల్ రాహుల్ ఔట్.. డబ్ల్యూటీసీ ఫైనల్ కి డౌటే..?

Kl Rahul

Kl Rahul

కేఎల్ రాహుల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకున్నాడు. WTC ఫైనల్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గురించి తాజాగా ఓ పెద్ద అప్‌డేట్ వచ్చింది. RCBతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు KL రాహుల్ గాయపడ్డాడు. ఆ సమయంలో రాహుల్ గాయం చాలా తీవ్రంగా అనిపించింది.. మైదానంలో అతను నొప్పితో బాధపడుతూ కనిపించిన తీరు చూసి అభిమానులు షాక్ అయ్యారు. క్రిక్‌బజ్‌లోని ఒక నివేదిక ప్రకారం.. KL రాహుల్ మొత్తం IPL 2023 సీజన్ నుంచి తొలగించబడ్డాడు. అతను ఫ్రాంచైజీ క్యాంపును విడిచిపెట్టి ముంబైకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Also Read : IPL 2023 : రాజస్థాన్ రాయల్స్ తో గుజరాత్ టైటాన్స్ ఢీ..

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. రాహుల్ ఐపీఎల్ 2023కి దూరం అయ్యాడు. రాహుల్ ఫ్రాంచైజీని విడిచిపెట్టి స్కానింగ్ కోసం ముంబైకి బయలుదేరాడు. క్రిక్‌బజ్ నివేదిక నుంచి ఈ సమాచారం అందింది. ఫీల్డింగ్‌లో గాయపడిన కేఎల్ రాహుల్ గాయాన్ని పర్యవేక్షించడం ఇప్పుడు బీసీసీఐ చేతిలో ఉంది. సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్స్ లిస్ట్‌లో రాహుల్ చేర్చబడ్డాడని, అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎంపికైన జట్టులో అతను ఉన్నాడు.

Also Read : Jammu Kashmir: వరసగా మూడో రోజు కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల కోసం వేట..

లక్నో కెప్టెన్ కఎల్ రాహుల్ గాయం తీవ్రంగా ఉంది. ఇంకా నొప్పితో ఉన్నాడు. వచ్చే నెల లండన్ లో జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కేఎల్ రాహుల్ ఆడగలడా లేదా అనేది అతని స్కానింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. అయితే, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రాహుల్ ఆడే అవకాశం లేదని ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన జట్టు 5 మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేసుకుంది. 4 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. CSKతో జరిగిన చివరి మ్యాచ్‌లో వర్షం కారణంగా ఫలితం లేదు.

Exit mobile version