NTV Telugu Site icon

KL Rahul: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముందు టీమిండియాకు బిగ్ షాక్.. కేఎల్ రాహుల్‌కు గాయం

Kl Rahul

Kl Rahul

KL Rahul: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా జట్టు ఇంట్రాస్క్వాడ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ బరిలోకి దిగింది. భారత్ ఏ టీమ్‌తో బ్యాటర్లు, బౌలర్లుగా విడిపోయి మ్యాచ్‌ ఆడింది. పిచ్‌ పేసర్లకు అనుకూలంగా ఉండటంతో భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఇక, పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏలో ఈరోజు (శుక్రవారం) ఉదయం కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. కుడి మోచేతికి బంతి బలంగా తాకడంతో ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియోథెరపిస్ట్‌ వచ్చి ప్రాథమిక చికిత్స చేయగా.. నొప్పి తగ్గకపోవడంతో మైదానాన్ని వీడాడు. దీంతో పెర్త్ టెస్టులో అతడు ఆడటంపై అనుమానాలు రేగాయి. దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

Read Also: Mudragada Letter: సీఎం చంద్రబాబుకు ముద్రగడ లేఖ.. మీకు తగునా అంటూ..!

అయితే, కేఎల్ రాహుల్ గాయం తీవ్రంగా ఉంటే భారత్‌కు ఓపెనింగ్‌లో సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాగా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిరీస్ ఆరంభ మ్యాచ్‌కు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలి టెస్టు మ్యాచ్‌ల్లో ఫామ్‌తో సతమతమవుతున్న రాహుల్‌కి రోహిత్ గైర్హాజరీలో జైస్వాల్‌తో కలిసి భారత బ్యాటింగ్‌ను నడిపించే బాధ్యతను ఉంది. కానీ, అతని గాయం ఇప్పుడు జట్టు మేనేజ్‌మెంట్‌కు ఇబ్బందులను కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో యశస్వీ జైస్వాల్ కు బ్యాకప్ ఓపెనర్‌గా ఉన్న అభిమన్యు ఈశ్వరన్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది.

Read Also: Kaleshwaram Project: ఈనెల 20 నుంచి కాళేశ్వరంపై విచారణ.. 2 వారాలు హైదరాబాద్‌లోనే జస్టిస్‌ ఘోష్‌

కాగా, ఇంట్రాస్క్వాడ్ వార్మప్‌ మ్యాచ్‌లో భారత సీనియర్‌ బ్యాటర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. కేఎల్ రాహుల్ గాయం కారణంగా గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లగా.. విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, రిషభ్‌ పంత్ త్వరగా అవుట్ అయ్యారు. జైస్వాల్ 15 రన్స్, రిషబ్ 19 పరుగులు చేసి డగౌట్ కు చేరగా.. విరాట్ (15) ఔటైన వెంటనే నెట్స్‌లోకి వెళ్లి.. ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. భారత యువ పేసర్లు ముకేశ్‌ కుమార్, నితీశ్‌ రెడ్డి, సైని కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసినట్లు బీసీసీఐ తెలిపింది.