KL Rahul History: కేఎల్ రాహుల్ రికార్డుల జాతర.. టీమిండియా మొదటి బ్యాటర్‌గా అరుదైన ఘనత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul SENA Record: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 207 బంతుల్లో మూడు అంకెల స్కోరును అందుకున్నాడు. ప్రస్తుతం 241 బంతుల్లో 111 పరుగులతో క్రీజులో కొనసాగుతున్న రాహుల్.. తన టెస్టు కెరీర్లో 13వ శతకాన్ని నమోదు చేశాడు. ఈ సెంచరీతో మరో అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. సేనా దేశాలపై శతకం బాదిన ఎనిమిదో ఆసియా బ్యాటర్‌గా రాహుల్ నిలిచాడు.
టెస్టు క్రికెట్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (సేనా) దేశాలన్నింటిలోనూ సెంచరీలు సాధించిన ఆసియా బ్యాటర్ల జాబితాలో కేఎల్ రాహుల్ చోటు సంపాదించాడు. ఈ జాబితాలో మహమ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, సయీద్ అన్వర్, రాహుల్ ద్రవిడ్, యూనిస్ ఖాన్, కుమార సంగక్కర, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు ఉన్నారు. తాజాగా రాహుల్ వారి సరసన నిలిచాడు. అంతేకాకుండా సేనా దేశాల్లో ఓపెనర్‌గా సెంచరీలు చేసిన పాకిస్థాన్ దిగ్గజం సయీద్ అన్వర్ రికార్డును కూడా కేఎల్ రాహుల్ సమం చేశాడు. విదేశీ పిచ్‌లపై ఓపెనర్‌గా రాణించడం ఎంత కష్టమో తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో నాలుగు దేశాల్లోనూ శతకాలు సాధించడం రాహుల్ నిలకడకు నిదర్శనంగా నిలుస్తోంది.
Also Read
- Ind Vs Nepal: నేపాల్‌పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
- SL Vs PAK: శ్రీలంకపై పాకిస్థాన్ ఘన విజయం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు ఇలా..
- Ind Vs Nepal: టాస్ గెలిచిన నేపాల్.. బ్యాటింగ్‌లో తడబడ్డ భారత్..
- Mohammed Siraj: ఓవల్‌లో సిరాజ్ మెరుపులు.. అయినా ప్లేయింగ్ XIలో దక్కని చోటు..
భారత్ తరఫున టెస్టుల్లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలోనూ రాహుల్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఓపెనర్‌గా అతడు ఇప్పటివరకు 12 సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో సునీల్ గవాస్కర్ 33 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. వీరేంద్ర సెహ్వాగ్ 22 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. మురళీ విజయ్ కూడా 12 సెంచరీలతో రాహుల్‌తో సమానంగా ఉన్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులు చేసింది. మూడో రోజు మూడో సెషన్ ఆట కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ 82 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 293 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 112 పరుగులతో, దేవదత్ పడిక్కల్ 79 పరుగులతో క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ (85) కీలక ఇన్నింగ్స్ ఆడి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్కోరుకు 75 పరుగుల దూరంలో ఉంది.
తాజావార్తలు
-
KL Rahul History: కేఎల్ రాహుల్ రికార్డుల జాతర.. టీమిండియా మొదటి బ్యాటర్‌గా అరుదైన ఘనత!
-
Trump Praises India’s GDP Growth: భారత్‌ను చూసి నేర్చుకోవాలి.. దేశ ఆర్థిక వృద్ధిపై ట్రంప్ ప్రశంసలు
-
Astrology: నవంబర్ 21 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి అన్నీ శుభాలే.. కానీ..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!