NTV Telugu Site icon

Khurram Manzoor: కోహ్లీపై మాట మార్చిన పాక్ క్రికెటర్.. అప్పుడు తుస్సు, ఇప్పుడు తోపు

Khurram On Virat Kohli

Khurram On Virat Kohli

Khurram Manzoor Gives Clarity On His Comments On Virat Kohli: ఇటీవలే విరాట్ కోహ్లీ కంటే తానే బెటరంటూ గొప్పలు పోయిన పాక్ వెటరన్ క్రికెటర్ ఖుర్రమ్ మంజూర్.. ఇప్పుడు మాట మార్చేశాడు. కోహ్లీతో తనకు పోలికేంటి? అంటూ రివర్స్ గేర్ వేశాడు. తాను చేసిన వ్యాఖ్యల్ని మీడియా వాళ్లు వక్రీకరించారని, కోహ్లీని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని పేర్కొన్నాడు. కేవలం తన విజయాల గురించి చెప్పుకోవడానికి మాత్రమే కోహ్లీతో పోల్చుకున్నానే తప్ప.. కోహ్లీని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నాడు. విరాట్ కోహ్లీని తాను ఆరాధిస్తానని, ఈ తరానికి అతడొక గొప్ప ప్లేయర్ అంటూ చెప్పుకొచ్చాడు.

Journalist Tortured: జర్నలిస్టుని చెట్టుకు కట్టేసి టార్చర్.. ఎందుకో తెలుసా?

అసలేం జరిగిందంటే.. రీసెంట్‌గా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ తనకంటే గొప్పేమీ కాదంటూ ఖుర్రమ్ మాట్లాడాడు. ఇప్పుడున్న టాప్‌ 10 వన్డే బ్యాటర్లలో తానే వరల్డ్ నంబర్‌ వన్‌ అని.. తన తర్వాతే విరాట్ కోహ్లీ ఉన్నాడని చెప్పాడు. కోహ్లీ ప్రతి ఆరు ఇన్నింగ్స్‌లకు ఓ సెంచరీ సాధించాడని, తాను మాత్రం 5.68 ఇన్నింగ్స్‌లకే సెంచరీ చేశానని పేర్కొన్నాడు. ఇదే ప్రపంచ రికార్డ్ అని జబ్బలు కొట్టుకున్నాడు కూడా! దాదాపు పదేళ్లపాటు 53 సగటుతో తాను పరుగులు సాధించానని, లిస్ట్‌ – A క్రికెట్‌కు సంబంధించి తాను ప్రపంచంలోనే ఐదో ర్యాంక్‌లో ఉన్నానని అన్నాడు. గత 48 ఇన్నింగ్స్‌ల్లో తాను 24 సెంచరీలు నమోదు చేశానన్నాడు. ఈ విధంగా తనని తాను గొప్పగా చెప్పుకోవడం కోసం కోహ్లీ పేరుని ప్రస్తావించడంతో.. ఖుర్రమ్‌పై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే అతడు ట్విటర్ మాధ్యమంగా తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చాడు.

Dead Body In Truck: లారీలో డెడ్ బాడీ.. షాక్‎కు గురైన ఓనర్

‘‘నా ఇంటర్వ్యూలో నేను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయి. నేను విరాట్‌ కోహ్లీని తక్కువ చేసి మాట్లాడలేదు. ఈ తరానికి అతడు ఒక గొప్ప ప్లేయర్‌. ఓ ఆటగాడిగా అతడ్ని నేను ఆరాధిస్తాను. లిస్ట్‌ ఏ క్రికెట్‌లో సెంచరీల నిష్పత్తి గురించి మాట్లాడుతూ.. కోహ్లి కంటే నా గణాంకాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. అతడు రెండో స్థానంలో ఉన్నాడని మాత్రమే చెప్పా. అసలు అతనితో నాకు పోలికే లేదు. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. అతని గణాంకాలతో సంబంధం లేదు. కోహ్లీ ఎప్పటికీ గొప్ప క్రికెటరే’’ అని ఖుర్రమ్‌ మంజూర్‌ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ తన తన గణాంకాలకు సంబంధించిన ఫొటోను జత చేసిన ఖుర్రమ్.. ఇకనైనా మీడియా సంస్థలు విచక్షణతో వ్యవహరించాలని చురకలంటించాడు.

Anurag Thakur: ఢిల్లీ నుంచి కేజ్రీవాల్‌ను తరిమికొడదాం.. కేంద్రమంత్రి ప్రతిజ్ఞ