NTV Telugu Site icon

Kapil Dev: సంజూతో సూర్యని పోల్చవద్దు, అదంతా వేస్ట్.. కపిల్ దేవ్ బాంబ్

Kapil Dev

Kapil Dev

Kapil Dev On Suryakumar Yadav And Sanju Samson Comparison: రీసెంట్‌గా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఎంత దారుణంగా విఫలమయ్యాడో అందరికీ తెలిసిందే! మూడు మ్యాచెస్‌లోనూ అతడు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో.. ఓ వన్డే సిరీస్‌లో వరుసగా గోల్డెన్ డక్ అయిన ఆటగాడిగా అతడు చెత్త రికార్డ్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. తీవ్ర విమర్శల పాలయ్యాడు కూడా! ఒక్క మ్యాచ్‌లోనూ కనీసం ఒక్క బంతిని కూడా ఎదుర్కోలేని సూర్యని వెంటనే తొలగించి, సంజూ శాంసన్‌ని తీసుకోవాలని డిమాండ్లు కూడా పెరిగాయి. కొందరు మాజీలు కూడా.. వన్డేల్లో సూర్యని పక్కనపెట్టడమే ఉత్తమమైన నిర్ణయమని అభిప్రాయాలు వ్యక్తపరిచారు.

Curd Rice: పెరుగన్నం తింటే.. ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!

అయితే.. టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ మాత్రం ఈ వ్యవహారంలో భిన్నంగా స్పందించాడు. సూర్యకుమార్‌ని సంజూ శాంసన్‌తో పోల్చవద్దని చెప్పాడు. అలాంటి పోలికలు దేనికి పనికిరావడని కూడా తేల్చి చెప్పాడు. కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘‘ఎవరైతే మెరుగైన ప్రదర్శన కనబరుస్తారో.. వాళ్లకు వరుస అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ సూర్యతో సంజూ శాంసన్‌ను అస్సలు పోల్చకండి. అసలు ఇలాంటి పోలికలు ఏమాత్రం సరికాదు. ఒకవేళ సంజూకి సూర్య లాంటి పరిస్థితే ఎదురైతే.. అప్పుడు మనం వేరొకరి గురించి మాట్లాడుకునే వాళ్లం కదా. అయినా.. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సూర్యకుమార్‌కు మద్దతుగా నిలవాలని భావిస్తే, అతడికే వరుస అవకాశాలు ఇస్తుంది. బయట జనం ఏం మాట్లాడుకున్నా.. జట్టు ఎంపిక విషయంలో యాజమాన్యానిదే అంతిమ నిర్ణయం. కాబట్టి.. ఇలాంటి పోలికలు వద్దు’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Cigarette Crime: సిగరెట్ పెట్టిన చిచ్చు.. అన్యాయంగా ఒకరు మృతి

ఇదే సమయంలో బ్యాటింగ్ ఆర్డర్ గురించి కపిల్ దేవ్ మాట్లాడుతూ.. మ్యాచ్ అయ్యాక బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఎవరెవరో ఏమోమో మాట్లాడుతున్నారన్నాడు. వన్డేల్లో ఇలాంటి మార్పులు చేయడం సహజమేన్నాడు. ఆఖరి వన్డేలో ఫినిషర్‌ పాత్ర పోషిస్తాడనే ఉద్దేశంతో.. సూర్యని ఏడో స్థానంలో పంపినట్లు తెలుస్తోందని అభిప్రాయపడ్డాడు. గతంలోనూ టీమిండియా ఇలాంటి ప్రయోగాలను ఎన్నోసార్లు చేసిందని గుర్తు చేశాడు. ఏదేమైనా.. జట్టుకు సంబంధించిన ప్రతి విషయంలో కోచ్‌, కెప్టెన్‌ ప్రధాన పోషిస్తారని.. ఎవరైనా ఆటగాడు తనకు బ్యాటింగ్‌ పొజిషన్‌లో ఇబ్బంది ఉందని చెబితే ఆ విషయాన్ని వాళ్లు పరిగణనలోకి తీసుకోవాలని సూచించాడు.