NTV Telugu Site icon

Kane Williamson: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. ఐపీఎల్ నుంచి కేన్ ఔట్

Kane Williamson Ruled Out

Kane Williamson Ruled Out

Kane Williamson Ruled Out Of IPl 2023 Due To Knee Injury: ఐపీఎల్ 16వ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకున్నామన్న ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించేలోపే.. గుజరాత్ టైటాన్స్‌కి ఓ భారీ దెబ్బ తగిలింది. అత్యంత కీలక ఆటగాడైనా కేన్ విలియమ్సన్.. గాయం కారణంగా ఈ సీజన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. శుక్రవారం (మార్చి 31వ తేదీన) రాత్రి చెన్నై ఇన్నింగ్స్‌లో భాగంగా.. రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన సిక్స్‌ని ఆపే ప్రయత్నంలో, బౌండరీ లైన్ వద్ద కేన్ విలియమ్సన్ డైవ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే అతని మోకాలికి తీవ్ర గాయమైంది. ఆ గాయం నొప్పితో అతడు విలవిల్లాడటంతో.. నడవలేకపోయాడు. దీంతో.. అతడ్ని సిబ్బంది తమ భుజాలపై ఎత్తుకొని వెళ్లింది. అతడు ఆడే పరిస్థితిలో లేకపోవడంతో.. అతని స్థానంలో సుదర్శన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా రంగంలోకి దింపారు.

Vijay Yesudas: యేసుదాసు తనయుడి ఇంట్లో భారీ చోరీ.. నగలు, పత్రాలు మాయం

కేన్ విలియమ్సన్‌కి గాయం అయినప్పుడే.. అందరికీ అనుమానాలు వచ్చాయి. ఒకవేళ ఇది తీవ్రమైతే.. అతడు ఈ సీజన్ నుంచి వైదొలగొచ్చని భావించారు. మరికొందరు మాత్రం.. తదుపరి మ్యాచ్‌కల్లా కేన్ కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ.. అందరూ అనుమానించిందే నిజం అయ్యింది. వైద్య పరీక్షల తర్వాత కేన్‌కి తగిలిన గాయం తీవ్రమైందని తేలింది. అతని మోకాలికి ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. దీన్నుంచి కోలుకోవాలంటే.. కనీసం 45 రోజుల నుంచి 60 రోజుల వరకు విశ్రాంతి అవసరం. ఈ తరుణంలోనే కేన్ ఈ ఐపీఎల్ సీజన్‌కి దూరం కానున్నాడు. ఈ విషయంపై గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ మాట్లాడుతూ.. కేన్ మోకాలికి తీవ్రమైన గాయమైందని, అతడు తర్వాతి మ్యాచుల్లో ఆడే పరిస్థితి కష్టమేనని బాంబ్ పేల్చాడు. ఎంతో అనుభవజ్ఞుడైన కేన్, గాయం కారణంగా ఇలా దూరమవ్వడంతో.. గుజరాత్ టైటాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

KKR vs PBKS : ముగిసిన పంజాబ్‌ బ్యాటింగ్‌.. కోల్‌కతా టార్గెట్‌ 192

ఇక గుజరాత్, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రుతురాజ్ గౌక్వాడ్ 92 పరుగులతో తాండవం చేయడంతో.. చెన్నై ఆ స్కోరు చేయగలిగింది. ఇక 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు.. మరో నాలుగు బంతులు మిగిలుండగానే 182 పరుగులు చేసి, ఆ లక్ష్యాన్ని ఛేధించింది. శుభ్మన్ గిల్ అర్థశతకంతో రాణించగా.. మిగిలిన ఆటగాళ్లు కూడా తమవంతు కృషి చేయడంతో.. గుజరాత్ సునాయాసంగా చెన్నైని ఓడించగలిగింది.