NTV Telugu Site icon

IND Vs NZ: న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. మూడో టీ20కి కెప్టెన్ విలియమ్సన్ దూరం

Kane Williamson

Kane Williamson

IND Vs NZ: టీమిండియాతో జరిగిన రెండో టీ20లో ఓటమి పాలైన న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడో టీ20కి కెప్టెన్ విలియమ్సన్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ జట్టు స్వయంగా ప్రకటించింది. అతడి స్థానంలో పేసర్ టిమ్ సౌథీకి జట్టు పగ్గాలు అందిస్తున్నట్లు వెల్లడించింది. గతంలో కేన్ విలియమ్సన్ మెడికల్ అపాయింట్‌మెంట్ తీసుకున్నాడని.. అయితే అదే సమయంలో మ్యాచ్ జరుగుతుండటంతో అతడు దూరమయ్యాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వివరించింది. చాలాకాలంగా విలియమ్సన్ మోచేతి గాయంతో బాధపడుతున్నాడని.. ఇటీవల అతడు ఫామ్ కోల్పోవడానికి కూడా అదే కారణమని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. అయితే ఇప్పుడు విలియమ్సన్ తీసుకున్న మెడికల్ అపాయింట్‌మెంట్ దేనికోసమో స్పష్టంగా తెలియదన్నాడు.

Read Also: Vijay Hazare 2022: రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన సీఎస్‌కే ఆటగాడు

మూడో టీ20కి కేన్ విలియమ్సన్ దూరం కావడంతో అతడి స్థానంలో మార్క్ చాప్‌మన్ ఆడుతున్నట్లు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ వెల్లడించాడు. చాప్‌మన్ చివరగా టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడినట్లు తెలిపాడు. టీమిండియాతో జరిగే మూడు వన్డేల సిరీస్ సమయానికి విలియమ్సన్ తిరిగి వస్తాడని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు. బుధవారం నాటికి ఆక్లాండ్‌లో జట్టుతో కలుస్తాడని చెప్పాడు. తమకు అతడు విలువైన ఆటగాడు అని.. బ్యాటింగ్ లైనప్‌లో వైవిధ్యం తెస్తాడని హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. కాగా రెండో టీ20లో విలియమ్సన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 52 బంతుల్లో అతడు 61 పరుగులు చేశాడు.

Read Also: Teja Sajja: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్’ టీజర్!