Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joe Root Breaks Sachin Tendulkar Record: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 23 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో డర్హామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఈ అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 23 వేల రన్స్ చేసిన బ్యాటర్ల జాబితాలో రూట్ రెండో స్థానానికి చేరుకున్నాడు.
జో రూట్ 521 ఇన్నింగ్స్‌లలో 23 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు. సచిన్ టెండూల్కర్ ఈ ఘనతను 522 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. ఈ జాబితాలో భారత స్టార్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ కేవలం 490 ఇన్నింగ్స్‌లలోనే 23 వేల అంతర్జాతీయ పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లీ తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా రూట్ నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో 23 వేల పరుగులు సాధించిన ఎనిమిదో బ్యాటర్‌గా రూట్ నిలిచాడు. అంతేకాకుండా ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
Also Read
- Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
- Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
జో రూట్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, రికీ పాంటింగ్, జాక్వెస్ కలిస్ 23 వేల అంతర్జాతీయ పరుగులు చేశారు. రూట్ ఇప్పటికే టెస్టు క్రికెట్లో టెండూల్కర్‌కు సంబంధించిన పలు రికార్డులను అధిగమించాడు. ఇటీవల టెస్టు క్రికెట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. అయితే క్రికెట్ అభిమానుల దృష్టి ప్రస్తుతం మరో కీలక రికార్డుపైనే ఉంది. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా ఉన్న సచిన్ రికార్డును కూడా రూట్ అధిగమిస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సచిన్ 15,921 టెస్టు పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రూట్ 14,278 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య 1,643 పరుగుల తేడా ఉంది.
ఈ ఏడాది డిసెంబర్లో 36 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టనున్న జో రూట్.. ఇప్పటికీ పరుగుల వరద పారిస్తున్నాడు. టెస్టుల్లో సచిన్ 200 మ్యాచ్‌లు ఆడగా.. రూట్ ప్రస్తుతం ఆ రికార్డుకు 31 టెస్టుల దూరంలో ఉన్నాడు. టెస్టు క్రికెట్లో రూట్ అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు పొందినప్పటికీ.. వన్డేల్లో అతడి ప్రదర్శన కూడా అసాధారణంగానే ఉంది. వాస్తవానికి రూట్ ప్రస్తుతం టెస్టుల కంటే వన్డేల్లో మెరుగైన బ్యాటింగ్ సగటును కలిగి ఉన్నాడు. శ్రీలంకతో తొలి వన్డేకు ముందు రూట్ 7,826 వన్డే పరుగులు సాధించాడు. 51కిపైగా సగటుతో పాటు 20 సెంచరీలు అతడి ఖాతాలో ఉన్నాయి. వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రూట్ ఇప్పటికే రికార్డు సృష్టించాడు.
తాజావార్తలు
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!